Just In
Don't Miss!
- Finance
సెబి షాకింగ్: HDFCకి భారీ జరిమానా, షేర్లు పతనం
- Automobiles
ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- News
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది? కలెక్షన్స్ ఆయన ముందే చెప్పారు.. సీక్వెల్ కూడా..: తరుణ్ భాస్కర్
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి చూపులు సినిమా ఒక డిఫరెంట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిందనే చెప్పాలి. రొమాంటిక్ డోస్, యాక్షన్, హేవి ఎమోషన్స్, భారీ ట్విస్టులు లేకుండా సింపుల్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఇక ఈ నగరానికి ఏమైంది 2 అయితే యూత్ లో ఒక కల్ట్ మూవీగా బ్రాండ్ సెట్ చేసుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ వస్తే కూడా బావుంటుందని జనాలు వేయిట్ చేస్తున్నారు. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పాడు.

కొంత గ్యాప్ ఇచ్చాడు కానీ..
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఒక్కసారిగా తన స్థాయిని పెంచుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు అయితే రెండు నేషనల్ అవార్డులను తెచ్చిపెట్టింది. ఇక మరో డిఫరెంట్ సినిమాతో వస్తాడు అనుకున్న ఈ దర్శకుడు కొంత గ్యాప్ ఇచ్చాడు గాని నటుడిగా బిజీగా కనిపించాడు. అలాగే ఒక రియాలిటీ షోతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

పెళ్లి చూపులు కలెక్షన్స్..
అయితే చాలా రోజుల తరువాత ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు ఈ దర్శకుడు. ముఖ్యంగా తన మొదటి రెండు సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ ను నిర్మాత సురేష్ బాబు గారు ముందే ఊహించారని అన్నాడు. మొదట పెళ్లి చూపులు చూసినప్పుడు 40కోట్ల వరకు అందుకుంటుందని అంచనా వేయగా అంతే వచ్చాయని తెలిపాడు.

ఈ నగరానికి ఏమైంది?.. 2కోట్లతో..
ఇక ఈ నగరానికి ఏమైంది? సినిమా మాత్రం పెళ్లి చూపులంత రేంజ్ లో అడదని అన్నారు. ఇది కేవలం ఒక యూత్ ను మాత్రమే ఎట్రాక్ట్ చేస్తుందని సుమారు 15కోట్ల వరకు రాబట్టగలదని అన్నారు. 2కోట్లతో నిర్మించిన ఆ సినిమా ఆ స్థాయిలో కలెక్ట్ చేయడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని కూడా తరుణ్ భాస్కర్ వివరణ ఇచ్చాడు.

సీక్వెల్ కావాలని అంటున్నారు
ఇక తనకు పెళ్లి చూపులు కంటే ఎక్కువగా యూత్ లో క్రేజ్ వచ్చింది మాత్రం ఈ నగరానికి ఏమైంది? సినిమతోనే అంటూ ఆ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందని జనాలు ఎక్కువగా అడుగుతున్నట్లు తరుణ్ భాస్కర్ వివరణ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ సినిమా మాత్రం కాస్త డిఫరెంట్ గా తన స్టైల్ లోనే ఉంటుందని కూడా ఈ యువ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

వెంకటేష్ సినిమా గురించి..
నెక్స్ట్ ప్రాజెక్టు ఏమిటనే విషయంలో పెద్దగా క్లారిటి ఇవ్వని తరుణ్ పూర్తిగా ప్రాజెక్టు సెట్టయిన తరువాత అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఉంటుందని అన్నాడు. ఇక వెంకటేష్ తో కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయాల్సి ఉందని అంటూ ఆ సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదని అన్నాడు. వేరే ఒక సినిమా చేసిన తరువాత మళ్ళీ వెంకటేష్ గారితో తప్పకుండా సినిమా ఉంటుందని కూడా తరుణ్ భాస్కర్ వివరణ ఇచ్చాడు.