twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Kashmir Files Collections: 8వ రోజ కూాడా ఆగని కలెక్షన్ల సునామీ.. నిర్మాతకు కాసుల పంట!

    |

    దేశవ్యాప్తంగా ఇప్పుడు 'ది కాశ్మీర్ ఫైల్స్' పేరు మారుమ్రోగుతోంది. సినిమాను హిందీలో తెరకెక్కించగా ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రికార్డులను క్రియేట్ చేస్తోంది. పెద్దగా హడావుడి లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వివాదస్పద చిత్ర బాక్సాఫీస్ రికార్డులను దిమ్మతిరిగెల బ్లాస్ట్ చేస్తోంది. మొదటి రోజు కంటే ఆ తరువాత రోజుల్లో కలెక్షన్స్ అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇక 8వ రోజుకు వచ్చేసరికి అత్యధికంగా వసూళ్లు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    దేశవ్యాప్తంగా హాట్ టాపిక్

    దేశవ్యాప్తంగా హాట్ టాపిక్

    కాశ్మీర్ లో హిందీ పండితుల మీద జరిగిన దాడులు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సెన్సిటివ్ ఫిల్మ్ కు మొదటిరోజే ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. క్రిటిక్స్ నుంచి మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా మెచ్చుకున్నారు.

    ఇక మోడీ, అమిత్ షా నుంచి ప్రశంసలు దక్కడంటతో సినిమాకు మంచి హైప్ పెరిగింది. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు చాలా మందిని ఆకట్టుకుంటోంది. రోజురోజుకు సినిమాను చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా ఎక్కువవుతోంది.

    దర్శకుడికి స్పెషల్ సెక్యూరిటీ

    దర్శకుడికి స్పెషల్ సెక్యూరిటీ

    వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ కు ఓ వర్గం వారి నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వెలువడుతున్నాయి. తమ మతాన్ని కించే పరిచే విధంగా చూపించారు అంటూ దర్శకుడికి బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నట్లు సమాచారం. ఇక దర్శకుడు పోలీసులను ఆశ్రయించగా అతనికి ప్రత్యేకంగా Y క్యాటగిరి భద్రతను ఏర్పాటు చేశారు.

    బడ్జెట్ ఎంతంటే..

    బడ్జెట్ ఎంతంటే..

    ఇక సినిమా బిజినెస్ విషయానికి వస్తే జీ స్టూడియోస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 15కోట్లవరకు అయినట్లు తెలుస్తోంది. ఇక సినిమాను విడుదల చేసిన మొదటి రోజు కేవలం 3.55కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఆ తరువాత సినిమా ఏకంగా ప్రధాని మోదీని అకర్షించడంతో ఆయన చిత్ర యూనిట్ సబ్యులకు ప్రత్యేకంగా అభినందించారు. దీంతో అప్పటి నుంచి సినిమాకి ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది.

    రోజురోజుకు పెరిగిన కలెక్షన్లు

    రోజురోజుకు పెరిగిన కలెక్షన్లు

    మార్చి 11వ తేదీన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ తో పాటు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ రెండవ రోజు నుంచి వసూళ్ల సంఖ్య పెంచికుంది. మొదటి రోజు 3.55కోట్లు రాగా రెండవ రోజు 8.50కోట్లు మూడవ రోజు 15.10కోట్లు, నాలుగవ రోజు 15.04కోట్లు ఐదవ రోజు 18.02కోట్లు, ఆరవ రోజు 19.05కోట్లు, ఏడవ రోజు 18.05కోట్లు వచ్చాయి.

    8వ రోజు భారీగా..

    8వ రోజు భారీగా..

    ఇక 8వ రోజు సినిమా వసూళ్ళు మరింత పెరిగాయి. హొలీ పండగ సందర్భంగా హాలిడే కావడంతో మరికొంత కలెక్షన్స్ పెరిగాయి. శుక్రవారం రోజు 19.15కోట్లు వచ్చాయి. ఒక విధంగా ఇది బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పవచ్చు. ఒక విధంగా నార్త్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా సినిమా వసూళ్లు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి.

    టోటల్ కలెక్షన్స్

    టోటల్ కలెక్షన్స్

    ఇక మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే 8 రోజుల్లో ద కాశ్మీర్ ఫైల్స్ మూవీ 116.47 కోట్లు వరకు నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. పోటీగా ప్రభాస్ పాన్ ఇండియా సినిమా వచ్చినప్పటికీ సెంటిమెంట్ తో ది కాశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో డామినేట్ చేసింది. ఇక 15 కోట్ల పెట్టుబడులు పెట్టగా సినిమా ఇప్పటి వరకు 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది అంటే ఏ స్థాయిలో. ప్రాఫిట్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

    English summary
    The kashmir files day 8 total world wide box office collections..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X