twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Kashmir Files : రాధేశ్యామ్ తో పోటీగా బరిలోకి.. మొదటి రోజే అద్భుతమైన కలెక్షన్స్!

    |

    అనుపమ్ ఖేర్ నటించిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా మార్చి 11న విడుదలైంది. విడుదలైన మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించింది. కాశ్మీరీ పండిట్లపై తీసిన ఈ హృదయ విదారక చిత్రం మొదటి రోజునే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రమే కాదు చాలా మంది హృదయాలను గెలుచుకుంది. మొదటి రోజే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఈ 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా రివ్యూ రైటర్స్ నుంచి మాత్రమే కాదు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు ఆసక్తికరంగా మారాయి. తొలిరోజు కలెక్షన్లు ఎంత అనేది తెలుసుకుందాం.

     విడుదల చేయలేక

    విడుదల చేయలేక

    మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, పునీత్ ఇస్సార్ తదితరులు కీలక పాత్రలలో నటించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' మూవీ జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదల కావాల్సింది. అయితే ఆ సమయంలో కోవిడ్ థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో కరోనా కేసులు ఎక్కువ ఉండటంమే కాక ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో వీకెండ్ లాక్ డౌన్ పెట్టడంతో అప్పుడు విడుదల చేయలేక రిలీజ్ పోస్ట్ ఫోన్ చేశారు.

    ‘రాధే శ్యామ్‌' సైతం

    ‘రాధే శ్యామ్‌' సైతం


    అలా ఎట్టకేలకు ఈ సినిమాను మార్చి 11న విడుదల చేశారు. మార్చి 10న సూర్య నటించిన 'ఈటీ' సినిమా తెలుగు, తమిళం సహా కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయింది. అంతేకాక ప్రభాస్‌ పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్‌' సైతం పెద్ద ఎత్తున అదే రోజున విడుదలయింది. హిందీ సహా ఇండియాలో 2200 థియేటర్లలో రాధేశ్యామ్ విడుదలైంది. అయితే ఇంత పోటీ ఉన్నా సినిమా విడుదల చేయాలని భావించి విడుదల చేశారు.

    మొదటి రోజు 3.55 కోట్లు

    మొదటి రోజు 3.55 కోట్లు


    ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ది కాశ్మీర్ ఫైల్స్ మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్‌స్ ఎంత వచ్చాయి అని పంచుకున్నారు. ఆయన రాసుకొచ్చిన దాని ప్రకారం ది కాశ్మీర్ ఫైల్స్ మొదటి రోజు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. చాలా పరిమిత స్క్రీన్‌స్లో విడుదల అయినప్పటికీ మొదటి రోజు ముగిసే సమయానికి సినిమా మరింత బలపడింది. ఈవినింగ్ మరియు నైట్ షోలు చాలా సాధారణమైనవి కానీ 2 మరియు 3 రోజుల్లో విపరీతమైన పెరుగుదల ఉంటుంది అని పేర్కొన్నారు. భారత దేశంలో ఈ సినిమా మొదటి రోజు 3.55 కోట్లు సంపాదించింది.

     కాశ్మీరీ పండిట్ల ఊచకోత

    కాశ్మీరీ పండిట్ల ఊచకోత

    వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్ 1990లో జరిగిన కాశ్మీరీ పండిట్ల ఊచకోత ఆధారంగా రూపొందించబడింది. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత బాధాకరమైన సంఘటనలలో ఒకటిగా చెబుతుంటారు. ఈ ఘటన కాశ్మీరీలు సహా ఇతర భారతీయుల మనస్సులలో దశాబ్దాలుగా నిలిచిపోతుంది.

    ఎన్ని థియేటర్లలో విడుదలైంది

    ఎన్ని థియేటర్లలో విడుదలైంది


    సినిమా ట్రైలర్‌లో కనిపించిన కాశ్మీరీ పండిట్ల భయాందోళనలు, వారి మానసిక సంఘర్షణ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాని ఫలితమే ఇప్పుడు సినిమా చూసేందుకు జనాలు బారులు తీరుతున్నారు. కాశ్మీర్ ఫైల్స్ భారతదేశంలో 561 సినిమా థియేటర్లలో, 113 ఓవర్సీస్ స్క్రీన్లలో విడుదలైంది. ఇతర భారీ బడ్జెట్ సినిమాల కంటే ఈ సంఖ్య చాలా తక్కువ. అయితే ఈ సినిమా తొలిరోజు వసూళ్లు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

    English summary
    Mithun Chakraborty, Anupam Kher, Pallavi Joshi, Puneet Issar, The Kashmir Files Collections,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X