»   » హాలీవుడ్ చిత్రాలను తొక్కేసిన బాహుబలి2.. టాప్ వన్‌గా రికార్డు.. వివరాలు ఇవే..

హాలీవుడ్ చిత్రాలను తొక్కేసిన బాహుబలి2.. టాప్ వన్‌గా రికార్డు.. వివరాలు ఇవే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమెరికా, కెనడాలో భారతీయ చిత్రాలకు ఆదరణ కొంత తక్కువే. హాలీవుడ్ చిత్రాల జోరే అక్కడ కొనసాగుతుంటుంది. ఇటీవల వచ్చిన సుల్తాన్, పీకే, దంగల్ సినిమాలు కలెక్షన్ల పరంగా హాలీవుడ్ సినిమాలకు దీటుగా నిలిచాయి. తాజాగా బాహుబలి సినిమా ఆ పరిస్థితి మార్చేసింది. అమెరికా, కెనడాలో హాలీవుడ్‌ సినిమాలు తొలిరోజు సాధించిన రికార్డును బాహబులి2 బద్దలు కొట్టింది.

టాప్ వన్‌గా..

టాప్ వన్‌గా..

ఇటీవల విడుదలైన ది ఫేట్ ఆఫ్ ది ప్యూరియస్ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డు క్రియేట్ చేసింది. యూఎస్, కెనడాలో ఈ చిత్రం 19,40,625 అమెరికా డాలర్లు వసూలు చేసింది. అయితే ఈ రికార్డును బాహుబలి2 అధిగమించింది. శుక్రవారం విడుదలైన బాహుబలి2 ది కన్‌క్లూజన్ 26,25,000 డాలర్లను వసూలు చేసింది.


టాప్ టెన్ హాలీవుడ్ చిత్రాల కలెక్షన్లు (డాలర్లలో)

టాప్ టెన్ హాలీవుడ్ చిత్రాల కలెక్షన్లు (డాలర్లలో)

1. బాహబులి ది కన్‌క్లూజన్ 26,25,000
2. ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ 19,40,625
3. బ్యూటీ అండ్ ది బీస్ట్ 661,724
4. ది బాస్ బేబీ 5,26, 624
5. గోయింగ్ ఇన్ స్టయిల్ 4,51,249
6. బార్న్ ఇన్ చైనా 3,70,515
7. గిఫ్టెడ్ 3,64,135
8. అన్ ఫర్గెటబుల్ 3,56,100
9. ది ప్రామిస్ 2,62,276
10. స్మర్ఫ్స్ ది లాస్ట్ విలేజ్ 2,19,149


ప్రపంచవ్యాప్తంగా బాహుబలి మానియా

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి మానియా

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బాహుబలి మానియా కొనసాగుతున్నది. ఎవరినోటా విన్నా బాహుబలి చూశావా? చూడకపోతే ఎప్పుడు చూస్తున్నావా? చూస్తే ఎలా అనిపించింది. ఏ రేంజ్ హిట్ట? ఇలాంటి ప్రశ్నలు చకచకా వచ్చేస్తున్నాయి. సినీ అభిమానులపై ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య ఒక కొత్త లోకానికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. బాహుబలి చూడాలనిపించడానికి ఒక ప్రధాన కారణం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఒకటైతే. బాహుబలి2 సినిమాలో ప్రభాస్‌పై చిత్రీకరించిన సన్నివేశాలు, గ్రాఫిక్ వర్క్ ప్రేక్షకుడిని మరో లోకానికి తీసుకెళ్తున్నాయి. దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, నాజర్, సత్యరాజ్ తదితరులు నటించిన సంగతి తెలిసిందే.


1000 కోట్ల దిశగా..

1000 కోట్ల దిశగా..

బాహుబలి2 సినిమా దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. బాహుబలి సినిమా విడుదలకు ముందే శాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ హక్కుల కింద రూ.500 వసూలు చేసింది. తొలి రోజు అంచనాల ప్రకారం వారం నుంచి పది రోజులపాటు బాహుబలి2 హవా కొనసాగితే రూ.1000 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.


English summary
The Prabhas-starrer Baahubali created a rare record in US, Canada, This movie is overcome the The Fate of the Furious records. As per reports, Baahubali released in over 9000 screens worldwide. As per early trade estimates, Baahubali 2 is expected to do a whopping business of Rs 100 crore on its opening day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu