»   » అటు హాట్ రేష్మి..ఇటు యాక్షన్ మనోజ్, మధ్యలో నాగశౌర్య

అటు హాట్ రేష్మి..ఇటు యాక్షన్ మనోజ్, మధ్యలో నాగశౌర్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిన్న సినిమాల సీజన్ నడుస్తోంది. క్రితం వారం రిలైజన క్షణం, టెర్రర్ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకోవటం ఉత్సాహంతో ఈ వారం మరిన్ని చిత్రాలు విడుదల కు సిద్దమవుతున్నాయి. రిలీజ్ అవుతున్న చిత్రాల లిస్ట్..ట్రైలర్స్ ఇస్తున్నాం..మీరు వీటిలో వేటిని చూస్తారో లేక అన్నీ చూస్తారో నిర్ణియించుకోండి. అలాగే మార్చి ఏడున మహాశివరాత్రి పండుగ శెలవు సైతం వీటికి ఏ మాత్రం కలిసి వస్తుందో చూడాలి.

ఈ శుక్రవారం ఎప్పుడో విడుదలకు సిద్దమైనా రకరకాల కారణాలు, ధియోటర్స్ దొరక్క పోవటం వంటి కారణాలతో తేది మారుతూ వచ్చిన సినిమాలు నాలుగు విడుదలఅవుతున్నాయి. వీటిలో ఒక్కొక్క సినిమా ఒక్కో విభిన్న కథాంశంతో రాబోతుంది. ఈ రోజు విడుదల కానున్న సినిమాలు గుంటూరు టాకీస్,శౌర్య, కళ్యాణ వైభోగమే మరియు శివగంగ.


నిజానికి గతంలో ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి ఇష్టపడని తెలుగు సినిమా దర్శక నిర్మాతలు ఇప్పుడు రెండు మూడు రిలీజ్ చేయటానికి ధైర్యం చేస్తున్నారు. ఏ సినిమా సత్తా ఉంటుందో ఆ సినిమా ఆడుతుందనే నిర్ణయం తీసుకుని ధియోటర్స్ లోకి దిగుతున్నారు.


ఒకేరోజు నాలుగైదు సినిమాలతో బరిలో దిగినా... తెలుగు సినిమా మార్కెట్ భారీగా పెరగటంతో పెద్దగా సమస్య కనిపించటం లేదు. ఎవరికి నచ్చిన సినిమాకు వారు వెళ్తున్నారు. ధియేటర్స్ కు కూడా ఫీడింగ్ ఉంటోంది.


అయితే ఈ పోటి కారణంగా కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా కలెక్షన్ల విషయంలో కాస్త వెనకపడుతున్నాయనేది మాత్రం వాస్తవం. మార్చి 4న అంటే ఈ రోజు మరో సారి ఇలాంటి పోటికి రంగం సిద్ధమవుతోంది.


స్లైడ్ షోలో ఈ వారం విడుదల అవుతున్న చిత్రాలు..ట్రైలర్స్


గుంటూరు టాకీస్

రేష్మి ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి


శౌర్య

మంచు మనోజ్ గ్యాప్ తీసుకుని దశరధ్ దర్శకత్వంలో చేసిన చిత్రం ఇది


కళ్యాణ వైభోగమే

నందినీ రెడ్డి, నాగశౌర్య కాంబినేషన్ ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది


శివగంగ

రాయ్ లక్ష్మి చేసిన హర్రర్ చిత్రం. ఇది డబ్బింగ్ సినిమా


rn

జై గంగాజల్

ప్రియాంకచోప్రా చేసిన ఈ చిత్రం రిలీజ్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది


rn

దావత్ ఈ షాదీ

ఇది హైదరాబాద్ మూవీ. గుల్లూ దాదా, హైదరాబాద్ నవాబ్స్ వంటి సినిమాలు ఫాలో అయ్యేవారి కోసం ఇది.లండన్ హాజ్ ఫాలెన్

తెలుగులోనూ ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ భారీగానే విడుదల అవుతోంది. మీరు ఇక్కడ తెలుగు వెర్షన్ ట్రైలర్ చూడవచ్చు.English summary
Couple of medium budget films are gonna clash on the first Friday in this March month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu