»   »  ‘తొలి ప్రేమ’ ఫస్ట్ డే కలెక్షన్స్: వరుణ్ తేజ దెబ్బ మామూలుగా లేదుగా....

‘తొలి ప్రేమ’ ఫస్ట్ డే కలెక్షన్స్: వరుణ్ తేజ దెబ్బ మామూలుగా లేదుగా....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Tholi Prema 1st Day Collections

'ఫిదా' సినిమాతో సూపర్ హిట్ ట్రాక్‌లోకి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ తన తాజా మూవీ 'తొలి ప్రేమ'తో బాక్సాఫీసు వద్ద మరోసారి తన సత్తా చాటాడు. ఫిబ్రవరి 10న విడుదలైన ఈ చిత్రం ఎవరూ ఊహించని కలెక్షన్లు సాధిస్తోంది. స్టార్ హీరోల సినిమాల రేంజిలో తొలి రోజు రూ. 9.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది.

తిరుగులేని ‘తొలిప్రేమ’

తిరుగులేని ‘తొలిప్రేమ’

ఈ వారం ఇంటిలిజెంట్, గాయిత్రి, తొలిప్రేమ విడుదలయ్యాయి. ఆల్రెడీ ‘ఇంటిలిజెంట్' చిత్రం పూర్తి నెగెటివ్ టాక్‌తో డీలా పడిపోయింది. మోహన్ బాబు మూవీ ‘గాయిత్రి' ఫర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. అయితే ‘తొలి ప్రేమ' చిత్రం ఈ రెండు చిత్రాలను మించిన హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాకు ఈ వారం తిరుగు ఉండుదు అంటున్నారు.

ఇంత రెస్పాన్స్ ఊహించలేదు

ఇంత రెస్పాన్స్ ఊహించలేదు

మెగా ఫ్యామిలీ హీరో అయినప్పటికీ వరుణ్ తేజ్ ఇంకా స్టార్ ఇమేజ్ తెచ్చుకోలేదు. పైగా వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడు. దీంతో ఈ సినిమాపై ముందు నుండీ పెద్దగా అంచనాలు లేవు. అయితే సినిమా యూత్ ఫుల్ గా బావుడటంతో పాజిటివ్ రెస్పాన్స్ భారీగా వస్తోంది.

‘ఫిదా’ను మించి ఫస్ట్ డే వసూళ్లు

‘ఫిదా’ను మించి ఫస్ట్ డే వసూళ్లు


ఇప్పటి వరకు వరుణ్ తేజ్ కెరీర్లో పెద్ద హిట్ ‘ఫిదా'. ఈ చిత్రం గతేడాది విడుదలై బాక్సాఫీసు వద్ద తొలి రోజు రూ. 8.45 కోట్లు వసూలు చేసింది. అయితే దాన్ని మించేలా ‘తొలి ప్రేమ' చిత్రం తొలి రోజు రూ. 9.5 కోట్లు వసూలు చేసింది.

ఏరియా వైజ్ తొలిరోజు షేర్

ఏరియా వైజ్ తొలిరోజు షేర్


‘తొలి ప్రేమ' చిత్రం తొలి రోజు షేర్ వసూళ్లపై ఓలుక్కేస్తే.... నైజాం: రూ. 1.18 కోట్లు, ఉత్తరాంద్ర రూ. 45 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 23 లక్షలు, కృష్ణ రూ. 23 లక్షలు, గుంటూరు రూ. 38 లక్షలు, నెల్లూరు రూ. 12 లక్షలు, ఆంధ్ర ఏరయాలో రూ. 1.67 కోట్లు, సీడెడ్ ఏరియాలో: రూ. 33 లక్షలు, యూఎస్ఏలో రూ. 1.44 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 52 లక్షలు షేర్ రాబట్టింది ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 5.13 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్, రూ. 9.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.

ప్రేమికుల రోజు ఎఫెక్ట్

ప్రేమికుల రోజు ఎఫెక్ట్


‘తొలి ప్రేమ' చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు మరింత ఊపందుకోనున్నాయి. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కావడం కూడా ఈ సినిమా వసూళ్లపై మంచి ఎఫెక్ట్ చూపడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.

English summary
Varun Tej has started 2018 in a terrific way. According to the latest reports, his Tholi Prema has opened to a good response at the box office and raked in nearly Rs 9.5 crore on the first day itself. It is expected to do even better in the coming days as it has received positive reviews from all corners.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu