»   » అక్టోబర్‌లో అన్నీ పెద్ద సినిమాలే...లిస్ట్ ఇదిగో

అక్టోబర్‌లో అన్నీ పెద్ద సినిమాలే...లిస్ట్ ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'బాహుబలి' ఘన విజయం సాధించి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి అబ్బురపరిచింది. తెలుగు సినిమాకు సరికొత్త మార్కెట్‌ను పరిచయం చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ గ్రామ దత్తత కథాంశంతో మహేశ్‌బాబు హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీమంతుడు' రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక నాని హీరోగా రూపొందిన 'భలే భలే మగాడివోయ్‌' మంచి విజయాన్నందుకుంది. తన మార్కు సినిమాలకు పూర్తి భిన్నంగా మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.


తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినా.. నిర్మాతలకు కాసుల పంట పండించింది. ఓవర్సీస్‌లో అగ్ర కథానాయకుల చిత్రాల రికార్డులను సైతం అధిగమించింది. అక్టోబర్‌లో విడుదలకానున్న ఈ చిత్రాలూ విజయపరంపరను కొనసాగిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.


చారిత్రకం, ఫిక్షన్‌, లవ్‌, యాక్షన్‌ ఇలా అన్ని కోణాలను సృశిస్తూ రూపొందిన సినిమాలు అక్టోబర్‌ నెలలో భారీ అంచనాలతో విడుదల కాబోతున్నాయి. తెలుగు సినీ ప్రేక్షకులకు వినోదాల విందు అందించేందుకు తెలుగు హీరోలు సిద్ధమవుతున్నారు. భిన్న కథానేపథ్యాలతో రూపొందిన విభిన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి.


ఆ సినిమాలు ఏంటి...రిలీజ్ లు ఎప్పుడు


భిన్న నేపథ్యంగా 'కంచె'

భిన్న నేపథ్యంగా 'కంచె'


ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం' కంచె'. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదలవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ ఓ సైనికుడి పాత్రలో కన్పించనున్నారు. అప్పటి పరిస్థితులను, యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించిందేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని ఓ సందర్భంలో క్రిష్‌ చెప్పారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబా, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు చింతాన్‌భట్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్‌ హీరోయిన్. మరో ప్రేమకథతో రామ్‌ 'శివమ్‌'

మరో ప్రేమకథతో రామ్‌ 'శివమ్‌'


రామ్‌, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం 'శివమ్‌'. అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్‌ పతాకంపై స్రవంతి రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి దర్శకుడిగా పరిచమవుతున్నారు. దేవీశ్రీ సంగీతం అందించారు. మంచి ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని హీరో రామ్‌ ధీమాగా చెబుతున్నాడు.'రుద్రమదేవి'గా వస్తున్న అనుష్క

'రుద్రమదేవి'గా వస్తున్న అనుష్క


కాకతీయ సామాజ్ఞ్రి రుద్రమదేవి చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ రూపొందిస్తున్న 'రుద్రమ దేవి' చిత్రం అక్టోబర్‌ 9న విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడినా... చిత్రకరణలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా దర్శకుడు గుణశేఖర్‌ పట్టువదలని విక్రమార్కుడిలా యత్నించి ప్రేక్షకుల ముందుకుతెస్తున్నాడు. అనుష్క టైటిల్‌ పాత్రలో నటిస్తుండగా అల్లు అర్జున్‌ గోనగన్నారెడ్డిగా.. దగ్గుబాటి రానా చాళుక్య వీరభద్రుడిగా కన్పించనున్నారు. కృష్ణంరాజు, ప్రకాశ్‌రాజ్‌, నిత్యామీనన్‌, కేథరిన్‌ ఇతర పాత్రలను పోషించారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం హిందీ భాషలోనూ అనువాదమవుతోంది. రామ్‌చరణ్‌ 'బ్రూస్‌లీ'

రామ్‌చరణ్‌ 'బ్రూస్‌లీ'


శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'బ్రూస్‌ లీ'. 'ద ఫైటర్‌' ట్యాగ్‌లైన్‌. రకుల్‌ప్రీత్‌సింగ్‌ కథానాయిక. దసరా కానుకగా అక్టోబర్‌ 16న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ఫైటర్‌గా కన్పించనున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి అతిథి పాత్రలో మెరవనున్నారు. ఆయన ఓ పాటలో సైతం కన్పిస్తారని సమాచారం. ఎస్‌.ఎస్‌.థమన్‌ స్వరాలందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు.అక్కినేని 'అఖిల్‌' తెరంగ్రేటం...

అక్కినేని 'అఖిల్‌' తెరంగ్రేటం...


అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'అఖిల్‌'. వీవీ వినాయక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 22న ప్రేక్షకుల ముందుక వస్తోంది. మరో హీరో నితిన్‌ నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం మరో విశేషం. థమన్‌, అనూప్‌రూబెన్స్‌ పాటలకు స్వరాలు సమకూర్చగా .. మణిశర్మ నేపథ్య సంగీతమందించారు. ఫిక్షన్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో అయేషా సెహగల్‌ హీరోయిన్.'షేర్‌'గా వస్తున్న కల్యాణ్‌రామ్‌

'షేర్‌'గా వస్తున్న కల్యాణ్‌రామ్‌


పటాస్‌తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా రూపొందిన చిత్రం 'షేర్‌'. ఈ సినిమా అక్టోబర్‌ 30న విడుదలవుతోంది. సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్ . గతంలో కత్తి చిత్రాన్ని తీసిన మల్లికార్జున్‌ ఈ సినిమాకు దర్శకుడు. థమన్‌ స్వరాలందించారు. విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై కొమర వెంకటేష్‌ నిర్మించారు.English summary
Here is the list of New and Latest Upcoming Telugu Movies 2015 release dates.This list is subject to changes as it depends on censor certification and production. At times the release dates of various Upcoming Telugu Movies may get postponed due to various reasons. Above is the Telugu Movies 2015 calendar this is an incomplete list and will be updated as the year goes by.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu