For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2016 :కేవలం దమ్మున్న కథలతో , హిట్టైన తెలుగు సినిమాలు లిస్ట్

  By Srikanya
  |

  హైదరాబాద్ :2016కు త్వరలో శుభం కార్డు పడబోతోంది. ఈ ఏడాది టాలీవుడ్‌కు ఎన్నో పాఠాలు నేర్పి మరీ వీడ్కోలు చెబుతోంది. స్టార్‌ పవర్‌కున్న రేంజ్‌ ఏంటో ఈ ఏడాది రుచి చూపించింది. అలాగే కథలో దమ్ముంటే హీరోల స్థాయితో సంబంధం లేదని నిరూపించింది.

  లో బడ్జెట్ లో కథా ప్రాధాన్య చిత్రాలు నిర్మించే నిర్మాతల భుజం తట్టి కొండంత బలాన్ని అందించింది. ప్రేక్షకుల అభిరుచిని చిన్నచూపు చూసిన అడల్ట్‌ కామెడీ చిత్రాలు చిన్నబోయేలా చేదు ఫలితాల్నిచ్చింది. భారీ బడ్జెట్లు కాదు.. బరువైన కథలు ముఖ్యమని హెచ్చరించి వెళుతోంది.

  ఈ ఏడాది టాలీవుడ్‌ ముఖ చిత్రం చాలా మారిపోయిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో కొత్త తరహా చిత్రాలు వస్తాయనే నమ్మకాన్ని ఇచ్చి వెళ్తోంది. 2016లో వచ్చిన కొన్ని సినిమాలు కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసాయి. వైవిధ్యం ఉంటే ఖచ్చితమైన విజయం చేకూరుతుందనే నమ్మకం ప్రొదిచేసాయి. న్యూ ట్రెండ్ అనిపిస్తూ వచ్చిన చిత్రాలు ఏమిటో ఓ సారి క్రింద చూద్దాం.

  సెన్షషన్ ...

  సెన్షషన్ ...

  విజయ్ దేవరకొండ, రితు వర్మ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ పెళ్లి చూపులు చిత్రంతో తరుణ్ భాస్కర్ అనే దర్శకుడు పరిచయమయ్యారు. ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద సెన్షషన్ క్రియేట్ చేసింది. చక్కటి స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో ఈ చిత్రం అద్బుతం సృష్టించిందనే చెప్పాలి.

  అదిరిపోయే థ్రిల్లర్

  అదిరిపోయే థ్రిల్లర్

  అడవి శేషు, అదా శర్మ , అనసూయ కాంబినేషన్ లో వచ్చిన క్షణం సినిమా ద్వారా రవికాంత్ పేరేపు అనే దర్శకుడు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ఊహించని ట్విస్ట్ లు, టర్న్ లతో భాక్సాఫీస్ వద్ద సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఓ మూడేళ్ల అమ్మాయి మిస్ అవటం అనే పాయింట్ చుట్టూ అల్లిన ఈ కథ, కథనం ఓ చక్కటి థ్రిల్లర్ గా ఆకట్టుకుంది.

  స్క్రీన్ ప్లే హైలెట్

  స్క్రీన్ ప్లే హైలెట్

  రామ్ చరణ్ , సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ధృవ చిత్రం స్టార్ హీరోలు ఇలాంటి విభిన్న చిత్రాలు కూడా చేస్తారా అనిపించింది. తమిళ రీమేక్ గా వచ్చినా చక్కటి, చిక్కటి స్క్రీన్ ప్లేతో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటూ సాగింది. రామ్ చరణ్ ..పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. దర్శకుడు చాలా స్టైలిష్ గా తెరకెక్కించాడు. ఇది ఓ విభిన్నచిత్రమే.

  నాని సినిమా

  నాని సినిమా

  ఇది నాని స్టామినా..ఇదీ నాని సినిమా అనేటట్లుసాగిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ చిత్రం జెంటిల్ మెన్. నాని, నివేదిత ధామస్, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం స్క్రీన్ ప్లే తో స్పెల్ బౌండ్ చేయటమంటే ఏంటో తెలియచెప్పి, భాక్సాఫీస్ వద్ద ఘన విజయంసాధించింది. తెలుగులో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే కొత్త కథే.

  ఎమోషన్స్ తో..

  ఎమోషన్స్ తో..

  నాగార్జున, కార్తి, తమన్నా ల కాంబినేషన్ లో రూపొందిన ఊపిరి చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిత్రమైన రెండు పాత్రల మధ్య ఘర్షణ, అనుబంధం చూపుతూ సాగిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఎమోషనల్ సక్సెస్ ని సాధించింది. తెలుగుకు ఇది కొత్త కథే.

  స్టన్నింగ్ గా సుకుమార్

  స్టన్నింగ్ గా సుకుమార్

  ఎన్టీఆర్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో సుకుమార్ క్రియేట్ చేసిన అద్బుతం నాన్నకు ప్రేమతో. హ్యూమన్ రిలేషన్స్, ఫైనాన్సియల్ కాలిక్యులేషన్స్, బటర్ ఫ్లై ఎఫెక్ట్ ని స్టన్నింగ్ గా చూపించి విజయం సాధించాడు దర్శకుడు.

  రీమేక్ అయినా

  రీమేక్ అయినా

  నాగచైతన్య, శృతి హాసన్ కాంబినేషన్ లో వచ్చిన మళయాళి రీమేక్ ప్రేమమ్. చందు మొండేటి..తెలుగు ఫ్లేవర్ అద్దుతూ రూపొందించిన ఈ చిత్రం రెగ్యులర్ మసాలా చిత్రాలకు విరుధ్దంగా సాగి సక్సెస్ అయ్యింది.

  త్రివిక్రమ్ సెల్యులాయిడ్

  త్రివిక్రమ్ సెల్యులాయిడ్

  నితిన్, సమంత, రావు రమేష్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం అ..ఆ. హ్యూమన్ రిలేషన్స్ ని ఫైనాన్సియల్ కాలిక్యులేషన్స్ ఎలా డామినేట్ చేయటానికి ప్రయత్నం చేస్తాయో హృద్యంగా చూపుతూ వచ్చిన ఈ చిత్రం లేటెస్ట్ జనరేషన్ లో వస్తున్న చిత్రాలకు భిన్నమైనదే.

  కొత్త జానర్ ఫిల్మ్

  కొత్త జానర్ ఫిల్మ్

  నాగశౌర్య, నారా రోహిత్, రెజీనా కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం అవసరాల శ్రీనివాస్ లోని దర్శకుడు ప్రతిభను మరోసారి మన ముందు ప్రదర్శనకు పెట్టింది. చక్కటి స్క్రీన్ ప్లేతో , ఫన్నీ డైలాగ్స్ తో వచ్చిన ఈ చిత్రం ఓ కొత్త తరహా జానర్ ని తెలుగు తెరపై ఆవిష్కరించింది.

  కొత్త కథతో

  కొత్త కథతో

  నాని మరో విభిన్న చిత్రం ఈ సంవత్సరం చేసాడు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ టైటిల్ తో హను రాఘవపూడి రూపొందించిన ఈ చిత్రం కొత్తతరహా కథ,కథనంతో సాగింది. ఓ విభిన్నమైన ప్రయత్నంగా అందరి ప్రశంసలూ పొందింది. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి.

  కొత్త ఆవిష్కరణ

  కొత్త ఆవిష్కరణ

  ఈ సంవత్సరం చివర్లో వచ్చిన వంగవీటి చిత్రం సైతం వర్మ కొత్తగా ఆవిష్కరించారు. వివాదాలు ముసురుకుంటున్న ఈ చిత్రం సినీ లవర్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది. ఈ సినిమా రెగ్యులర్ గా వచ్చే చిత్రాలకు భిన్నమైనదే.

  డబ్బింగ్ అయినా

  డబ్బింగ్ అయినా

  డబ్బింగ్ చిత్రమైనా బిచ్చగాడు చిత్రం ఈ సంవత్సరం భారీ స్దాయితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఇంతలా మనవాళ్లకు ఎక్కటానికి కారణం కేవలం కథలో చూపిన కొత్తదనమే అనటంలో సందేహం లేదు.

  స్క్రీన్ ప్లే హైలెట్ గా

  స్క్రీన్ ప్లే హైలెట్ గా

  సూర్య, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన 24 చిత్రం తెలుగు వారిని బాగానే ఆకట్టుకుంది. బిగి సడలని స్క్రీన్ ప్లే తో సాగిన ఈ చిత్రం థ్రిల్లర్ అభిమానులకు బాగా నచ్చింది. ఇది తెలుగులోకి వచ్చిన కొత్త తరహా కథే.

  నిఖిల్ చేసిన ప్రయోగం

  నిఖిల్ చేసిన ప్రయోగం

  కొత్త తరహా కథలను ఎంచుకుని తనకు వస్తున్న వరస ఫ్లాఫ్ లను అధిగమించిన హీరో నిఖిల్. నిఖిల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం కథ,కథనంలో కొత్త తరహా పోకడలు పోవటమే కలిసి వచ్చింది. ఈ సినిమాకు అదే ప్లస్ అయ్యి..నోట్ల రద్దు సమయంలో కూడా కలెక్షన్స్ కుంభవృష్టి కురిపించింది.

  సోగ్గాడే చిన్ని నాయినా

  సోగ్గాడే చిన్ని నాయినా

  నాగార్జున..సోషియో ఫాంటసీ జానర్ లోకి వచ్చి సినిమా చేస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే సోగ్గాడే చిన్న నాయినా అంటూ నాగ్ వచ్చి దుమ్ము రేపాడు. ఈ చిత్రం విజయానికి కథ,కథనమే ప్లస్ అయ్యింది. స్టార్ హీరోలు చేయటానికి ఇష్టపడని కథ లోకి వచ్చి, ఆత్మగా కనపడి హిట్ కొట్టాడు నాగ్.

  English summary
  2016 has been extremely fruitful for Tollywood and here are some films which set new trend in 2016 that can power Tollywood to new heights in the coming years.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X