For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ టాపిక్ : 'తుఫాను' బిజినెస్ పొజీషన్ ఏంటి?

By Srikanya
|

హైదరాబాద్‌: రాంచరణ్‌, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న చిత్రం 'జంజీర్‌'. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 'తుఫాను' పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంభందించిన ట్రైలర్స్ విడుదల చేయటంతో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలా మంది తెలుగు నిర్మాతలు సైతం ఈ చిత్రం రైట్స్ ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ట్రేడ్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, శ్రీహరి కీలక పాత్రధారులు కావటం కూడా బాగా ప్లస్ అయ్యింది.

నిర్మాతలైన రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారికి ఇప్పటికే రూ. 47 కోట్లు వరకూ ఎపి రైట్స్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. మొదట్లో అందరూ దీన్నో డబ్బింగ్ సినిమాగా పరిగణించారని, ట్రైలర్స్ విడుదల అయ్యాక ఒక్కసారిగా ఊహించని రీతిలో క్రేజ్ పెరిగిందని చెప్తున్నారు. 'తుఫాను' తెలుగు వెర్షన్ కి దర్శకుడు యోగి దగ్గరుండి తెలుగు నేటివిటీ అద్దటం ప్లస్ అయ్యిందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ మంచి మొత్తానికి అమ్ముడయ్యాయి. గబ్బర్ సింగ్ రేంజిలో ఈ పోలీస్ చిత్రం కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుందని భావిస్తున్నారు.

రాంచరణ్‌ మాట్లాడుతూ.. ఓ సినిమా చేయాలంటూ దర్శకుడు అపూర్వ లఖియా తన వద్దకు వచ్చారని, 'జంజీర్‌' రీమేక్‌ అని చెప్పే సరికి ఒక్కసారిగా భయమేసిందన్నారు. అసలే అమితాబ్‌ చిత్రం చిన్న తప్పు దొర్లినా అందరం మూల్యం చెల్లించుకోకతప్పదు.. అసలు ఈ తలనొప్పి అవసరమా అనిపించిందన్నారు. అయితే దర్శకుడు మాత్రం పట్టు వదల్లేదని కథ నచ్చితేనే చేయమని చెప్పారన్నారు. ఆ సమయంలో తన తండ్రి నుంచి వచ్చిన ప్రోత్సహం మరవలేదని చెప్పారు. ధైర్యంగా ముందడుగు వేయమని భరోసా ఇచ్చారని తెలిపారు. ఆ ధైర్యంతోనే ముందడుగేసి చిత్రంలో నటించినట్లు తెలిపారు. చిత్రంలో అన్ని అంశాలు ఉన్నాయని చరణ్‌ వివరించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తాను చేయలేని పాత్రలను చరణ్‌లో చూసి ఆనందపడుతున్నట్లు తెలిపారు. 'జంజీర్‌' చిత్రం చరణ్‌ కెరీర్‌లో పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అద్భుతమైన అవకాశాలు తక్కువగా వస్తాయని, అలాంటి వాటిని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని తన తండ్రి గా కోరుకున్నానని తెలిపారు.

English summary
Ever since Ram Charan and Priyanka Chopra's Thoofan trailers have been released the demand for AP distribution rights were suddenly increased. Most of the Tollywood producers are in queue to grab the AP rights of this movie. As per the Reliance Entertainment sources they are saying that they already have an offer of Rs. 47 Cr. for AP rights.Initially everybody under impression as it is a dubbing movie but after the trailers release all the doubts were cleared. Thoofan has been simultaneously shot in both Telugu and Hindi (as Zanjeer). Already Overseas rights were sold for an whooping amount.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more