»   » భాక్సాఫీస్: ఏ సినిమా హిట్? ..ఏది ఫట్?ఏది యావరేజ్?

భాక్సాఫీస్: ఏ సినిమా హిట్? ..ఏది ఫట్?ఏది యావరేజ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వారం..వారం..భాక్సాఫీస్ లెక్కలు మారిపోతూంటాయి. అంతకు ముందు వారం విడుదలైన సినిమాలు రిజల్ట్ లని బట్టి తదుపరి వారం కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఇక క్రిందటి వారం అజిత్ ..ఆట ఆరంభం భారీ గా విడుదలైంది. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రంతో పోటీకి దిగటానికి ఇక్కడ చిన్న సినిమాలు సైతం భయపడ్డాయి.

ఇక ఆ సినిమాతో పాటు బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ప్రేమ..ఇష్క్ ..కాదల్ చిత్రం విడుదలైంది. భారీ పబ్లిసిటీతో చిత్రం విడుదలైనా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కొత్త వాళ్లతో తీసిన ఈ చిత్రానికి స్టార్ కాస్టింగ్ బలం లేదు. కేవలం యూత్ నే టార్గెట్ చేసి విడుదల చేసారు.

అలాగే...సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ కండలు పెంచి మరీ చేసిన ఆడు మగాడురా బుజ్జీ ..కామెడీ ప్రధానంగా విడుదలైంది. మార్నింగ్ షోకే యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా బి,సి సెంటర్లలో బాగానే ఉంది.

ఈ వారం భాక్సాఫీస్ రిపోర్ట్..స్లైడ్ షో లో...

ఆట ఆరంభం

ఆట ఆరంభం

దీపావళి కానుకగా..అజిత్ హీరోగా తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది.. ఆరంభం. ఈ చిత్రం తెలుగులో ఆట ఆరంభం గా డబ్బింగైంది. సినిమా తమిళ డబ్బింగ్ అయినా..అజిత్ కు ఇక్కడ ఫాలోయింగ్ ఉండటం, నయనతార, తాప్సీ చేయటం తో బాగానే బిజినెస్ పరంగా వర్క్ అవుట్ అయ్యింది. అయితే నెగిటివ్ టాక్ తెచ్చుకోవటంతో ఇక్కడ అనుకున్నంత క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. కేవలం 'A'లలోనే ఈ చిత్రం కలెక్షన్స్ రాబడుతోంది.

ఆడు మగాడ్రా బుజ్జీ

ఆడు మగాడ్రా బుజ్జీ

'ప్రేమకథాచిత్రమ్‌'తో తొలి విజయాన్ని అందుకొన్న సుధీర్‌బాబు తాజా చిత్రం 'ఆడు మగాడ్రా బుజ్జీ'. గంగదాసు కృష్ణారెడ్డి దర్శకుడు దా పరిచయమయిన ఈ చిత్రం మొన్న శనివారం విడుదల అయ్యింది. నైజాం మినహా ఆంధ్రాలో చాలో చోట్ల సమ్మె ప్రభావంతో థియోటర్స్ లో షోలు పడలేదు. అయినా ఓపినింగ్స్ చాలా బాగా వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మల్టిప్లెక్స్ లలో పెద్దగా లేకున్నా... మిగతా థియోటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. బి,సి సెంటర్లలో ఈ చిత్రం 60 నుంచి 70 శాతం దాకా కలెక్షన్స్ సాధిస్తోంది. నిర్మాతలు సేఫ్ అని చెప్తున్నారు.

వెంకటాద్రి ఎక్సప్రెస్ ( రెండవ వారం )

వెంకటాద్రి ఎక్సప్రెస్ ( రెండవ వారం )

ఓ అబ్బాయి, అమ్మాయి... ట్రైన్ జర్నీ ఎప్పుడూ ఆసక్తికరమైన అంశమే. అలాంటి బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకుని ఓ పాత పాయింట్ ని కొత్త గా చెప్పటానికి ప్రయత్నించాడు దర్శకుడు మేర్లపాక మురళి. సందీప్‌కిషన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగటంతో రెండో వారం కూడా రీజనబుల్ కలెక్షన్స్ రాబట్టుతోంది. ముఖ్యంగా ఎ సెంటర్లలో ఈ సినిమా తన హవా చాటుతోంది.

ప్రేమ ఇష్క్ కాదల్

ప్రేమ ఇష్క్ కాదల్

పవన్ సాధినేని అనే నూతన దర్శకుడు కూడా ప్రేమ అనే విషయాన్ని తీసుకొని చేసిన మొదటి ప్రయత్నమే ‘ప్రేమ ఇష్క్ కాదల్'. హర్షవర్ధన్ రాణే, విష్ణు, హరీష్ వర్మ, వితిక, రీతు వర్మ, శ్రీ ముఖి లాంటి నూతన తారలతో తీసిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ పరంగా చాలా పూర్ గా ఉంది.. ఒకే అర్థం వచ్చే పదాన్ని మూడు భాషల్లో వచ్చేలా కాస్త డిఫరెంట్ గా టైటిల్ పెట్టిన పవన్ సాధినేని అంతే డిఫరెంట్ గా సినిమాని తీయలేకపోయాడని వినిపించింది. ఆయన టార్గెట్ చేసిన యూత్ ఆడియన్స్ ని ఈ చిత్రం చేరలేదు.

'ఆర్‌.. రాజ్‌కుమార్‌'

'ఆర్‌.. రాజ్‌కుమార్‌'బాలీవుడ్ లో వరస హిట్స్ తో దూసుకుపోతున్న సౌత్ దర్శకుడు ప్రభుదేవా. ఆయన తాజా బాలీవుడ్‌ చిత్రం 'ఆర్‌.. రాజ్‌కుమార్‌' నైజాంలో ఫరవాలేదనిపించుకుంది. మిగతా చోట్ల ఆ మాత్రం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. 'ఆర్‌.. రాజ్‌కుమార్‌' లో.... రాజకుమార్(షాహిద్ కపూర్) లక్ష్యం లేని కుర్రాడు. అతను డ్రగ్ లార్డ్ శివరాజ్(సోనూ సూద్) వద్ద పనిచేస్తూంటాడు. అతనికి ఓ వర్క్ శివరాజ్ అప్పచెప్తాడు. అతని రైవల్ డ్రగ్ డీలర్ మాణిక్(ఆషిష్ విధ్యార్ధి)ని చంపమని చెప్తారు. కానీ ఈ లోగా అతను ఓ అందమైన చదువుకున్న అమ్మాయి చంద(సోనాక్షి సిన్హా) తో ప్రేమలో పడతాడు. ఆమె మరెవరో కాదు..మాణిక్ మేనకోడలు. అప్పుడు హీరో..మొత్తం డ్రగ్ వ్యాపారాన్నే నాశనం చేస్తే కానీ ఈ సమస్య తీరదనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో మొత్తం వీళ్లద్దరినీ మలేషియా నుంచి ఆపరేట్ చేస్తున్న అజిత్ (శ్రీహరి) తల పడాల్సి వస్తుంది. అప్పుడేం జరిగిందనేది మిగతా కథ.

English summary

 The Telugu version of Ajith's biggest earner & Diwali release Arrambam is doing good business in AP. Although the film's numbers aren't that big or comparable to other well established Tamil Stars dubbed movies it has done reasonably well when compared to the rates it was sold at. The film is especially good in 'A' Centers owing to its Stylish action subject. Aadu Magadra Bujji has had an average 2 day weekend. The film isn't carrying a better talk either.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu