twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: USA లో 'అత్తారింటికి దారేది' కలెక్షన్లు

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' సినిమా కేవలం ఇక్కడే కాదు.. అమెరికాలో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో 22 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. ఇక అమెరికాలో అయితే మొదటి వారాంతంలోనే 9.53 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

    మొదటి మూడు రోజుల్లో మన రాష్ట్రంలో వచ్చిన వసూళ్లలో సగం మొత్తం అమెరికాలో కూడా వచ్చిందని తేల్చారు. దాంతో ఇప్పటివరకు అమెరికాలో ఉన్న తెలుగు సినిమా రికార్డుల చరిత్రను 'అత్తారింటికి దారేది' తిరగరాసింది. సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ వారాంతంలో టాప్ 15 సినిమాల్లో దీనిదే అగ్రస్థానమని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు.

    తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ..... విదేశాల్లో హిందీ సినిమాలు మొత్తం తమ జీవితకాలంలో సాధించలేని మొత్తాన్ని అత్తారింటికి సినిమా మూడు రోజుల్లోనే సాధించిందని చెప్పారు. ఇది కేవలం తెలుగు సినీ పరిశ్రమకే కాదు.. హిందీ చిత్ర పరిశ్రమకు కూడా కళ్లు తెరిపించాలని వ్యాఖ్యానించారు. అలాగే చెన్నై ఎక్సప్రెస్, యే జవాని హై దీవాని తర్వాత అత్తారింటికి దారేది ఉందన్నారు.

    ఈ చిత్రం నైజాం ఏరియాలో భారీ కలెక్షన్లతో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తొలి వీకెండ్ (శుక్ర, శని, ఆది) అసాధారణ షేర్ సాధించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.7.50 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. తొలివారం పూర్తయ్యేసరికి రూ. 12 కోట్ల షేర్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

    పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    Trade analyst Taran Adarsh tweeted, "What *most* Hindi films don't collect in entire lifetime from Overseas, #AttarintikiDaredi has collected in 3 days flat from US alone. Super." He further tweeted, "#AttarintikiDaredi has created History in USA, smashing all previous records and setting new ones.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X