»   » త్రిష,అనుష్క కలిసి... ఈ నెల 22 న పండుగ చేస్తారు

త్రిష,అనుష్క కలిసి... ఈ నెల 22 న పండుగ చేస్తారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అజిత్ హీరో గా నటించిన తమిళ చిత్రం ఎన్నై అరింధాల్. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎంతవాడుగాని అనే పేరుతో శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అనుష్క, త్రిష హీరోయిన్స్. ఈ చిత్రానికి ఏ.ఎం రత్నం నిర్మాత. ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఈ నెల 22న మనముందుకురానుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దర్శకుడు మాట్లాడుతూ.... యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. అజిత్ పాత్ర చిత్రణ మూడు భిన్న పార్శాల్లో సాగుతుంది. ఆయన నటన, పోరాటాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆధునిక యువతిగా అనుష్క, సంప్రదాయ నృత్యకారిణిగా త్రిష అభినయం అందరిని అలరిస్తుంది. కర్తవ్య నిర్వహణనే తన ప్రాణంగా భావించే ఓ పోలీస్ ఆఫీసర్‌కు వృత్తిలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది ఇందులో ఆసక్తికరంగా ఉంటుంది.

నిర్మాత మాట్లాడుతూ.... ఎన్.టి.రామారావు నటించిన భలే తమ్ముడు చిత్రంలోని ఎంతవారు గానీ... పాట పల్లవిని ఆధారం చేసుకుని ఈ చిత్రానికి ఈ పేరు పెట్టాం. కథానుగుణంగా చక్కగా కుదిరింది. చెన్నై, రాజమండ్రి, మలేషియా, జోధ్‌పూర్ తదితర ప్రాంతాలలో భిన్న మైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అని తెలిపారు.

Trisha's ‘Yenthavadu Gaani’ on 22 th

అలాగే ...నేను నిర్మించిన భారతీయుడు, ఒకే ఒక్కడు తరహాలోనే ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందనే నమ్మకముంది. సత్యదేవా అనే ఓ పోలీస్ ఆఫీసర్ కథే ఈ చిత్ర ఇతివృత్తం. గతంలో అజిత్ నటించిన ప్రేమలేఖ చిత్రాన్ని తెలుగులో నేనే విడుదల చేశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. సుధీర్ఘ విరామం తర్వాత ఆయనతో వరుసగా మూడు సినిమాల్ని చేయటం ఆనందంగా ఉంది. దర్శకుడు గౌతమ్‌మీనన్ సెంటిమెంట్, యాక్షన్ అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. హారీష్ జయ్‌రాజ్ చక్కటి బాణీలను అందించారు.

అరుణ్ విజయ్, వివేక్, సుమన్, పార్వతి నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జైరాజ్, సినిమాటోగ్రఫీ: డాన్ మాకార్థుర్, ఎడిటింగ్: ఆంటోని, నిర్మాణ పర్యవేక్షణ: ఏ.ఎం.రత్నం.

English summary
Ajith’s latest blockbuster ‘Yennai Arindhaal’ is all set to release in Telugu on 22th this month. Titled as ‘Yenthavadu Gaani’, the film is directed by Gautham Menon and stars Anushka and Trisha as the female leads.
Please Wait while comments are loading...