»   »  'ఖైదీ నంబర్.150' : కుట్ర..మెగా ఫ్యాన్స్ ఆగ్రహం, వార్నింగ్ లు, బిజినెస్ పై కొన్ని షాకిచ్చే నిజాలు

'ఖైదీ నంబర్.150' : కుట్ర..మెగా ఫ్యాన్స్ ఆగ్రహం, వార్నింగ్ లు, బిజినెస్ పై కొన్ని షాకిచ్చే నిజాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దాదాపు పదేళ్ళ సుదీర్గ విరామం తర్వాత త‌ర్వాత సోలో హీరోగా వ‌స్తున్నాడు చిరు. ఈ గ్యాప్ లో ఇండ‌స్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. చిరంజీవి హీరోగా ఏలుతున్న రోజులు, అప్పుడున్న ప‌రిస్థితులు ఇప్పుడు లేవు. పైగా మార్కెట్ రేంజ్ కూడా బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ప‌వ‌న్, మ‌హేష్,ప్రభాస్ లాంటి హీరోలు నెంబ‌ర్ వ‌న్ కోసం పోటీలో ఉన్నారు. ఇలాంటి టైమ్ లో సీనియ‌ర్ హీరో చిరంజీవి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి.. ర‌చ్చ చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

అయితే చిరంజీవి వీటిన్నటికీ అతీతుడులా కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతి కానుకగా వస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం 150' ప్రతి విషయంలోనూ అటు సినీ జ‌నాల‌ను, ఇటు ట్రేడ్ వ‌ర్గాల‌ను, టాలీవుడ్ ఇండ‌స్ట్రీని, రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న సంగతి తెలిసిందే.


దాదాపు ప‌దేళ్ల విరామం త‌ర్వాత ఈ సినిమాలో న‌టిస్తోన్న చిరు త‌న స్లిమ్ లుక్‌తో ప్రేక్ష‌కుల మ‌తి పోగొడితే...ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్‌కు యూ ట్యూబ్‌లో వ‌స్తోన్న స్పంద‌న చిరు క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌న‌డానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' టీజర్‌తో ఆయన స్టామినా ఏంటో రుజువైంది. ఈ సాంగ్ టీజర్ యూట్యూబ్‌లో ఏకంగా రికార్డులు సృష్టిస్తోంది. దీంతో మెగా ఖైదీపై అంచనాలు పీక్స్ చేరిపోయాయి.


'ఖైదీ నెం 150' విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈ సినిమాకు ఆడియో ఫంక్షన్ చేయకుండా డైరక్ట్ గా మార్కెట్ లో పాటలు విడుదల చేసారు. ఆ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో పంక్షన్ నిర్వహించకపోవడంతో టీమ్ పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఈనెల 4న జ‌ర‌గాల్సిన ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వాయిదా ప‌డింది. ఈనెల 7న ఈ వేడుక‌ని నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు మరో సారి వెన్యూ, డేట్ మారింది. ఇదంతా కుట్ర అంటున్నారు మెగా ఫ్యాన్స్.


ఈ నేపధ్యంలో అసలు బిజినెస్ పరిస్దితి ఏమిటి..మెగా ఫ్యాన్స్ మండిపడుతున్న కుట్ర ఏమిటి...అసలేం జరుగుతోంది. వంటి విషయాలు చూద్దాం.


దిమ్మి తిరిగేలా

దిమ్మి తిరిగేలా

మరో ప్రక్క ఖైదీ నెంబ‌ర్ 150 ప్రి రిలీజ్ బిజినెస్ సైతం దిమ్మ‌తిరిగే రేంజ్‌లో జ‌రుగిందిది. ఓవ‌రాల్‌గా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రూ.100 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల ట్రేడ్ వర్గాల స‌మాచారం. ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్, నెల్లూరు జిల్లాల్లో అయితే షాక్ ఇచ్చే రేట్లకు ఈ సినిమా రైట్స్ అమ్ముడయ్యాయి.


వీర ఫాలోయింగ్ కు తగినట్లే..

వీర ఫాలోయింగ్ కు తగినట్లే..

తూర్పు గోదావరి జిల్లాలో తొలి నుంచి చిరంజీవికి వీర ఫాలోయింగ్ ఉంది. దానికి తగినట్లుగానే...ఈ జిల్లా రైట్స్ ని అనుశ్రీ ఫిల్మ్స్ వారు 5.60 కోట్లకు ఈ చిత్రం రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ రేటు ఈ జిల్లాలో అంటే మామూలు విషయం కాదు.


పశ్చిమ గోదావరిలో ..

పశ్చిమ గోదావరిలో ..

ఇక పశ్చిమగోదావరి విషయానికి వస్తే... శ్రీ షన్ముఖ ఫిల్మ్స్ వారు...ఈ చిత్రం రైట్స్ ని 4.75 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇదీ నిజం చెప్పాలంటే అసలు ఎవరూ ఊహించని రేటే.


నెల్లూరులో ..

నెల్లూరులో ..

నెల్లూరులో అయితే S2 సినిమాస్ వారు ఈ చిత్రం ధియోటర్ రైట్స్ ని 3.25 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఈ రేటు విషయం ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావటం, ప్రాజెక్టుకు వస్తున్న క్రేజ్ ఈ స్దాయి బిజినెస్ జరగటానికి దోహదం చేసాయనటంలో సందేహం లేదు.


కొత్త రికార్డ్ లు..

కొత్త రికార్డ్ లు..

ఈ నేప‌థ్యంలోనే ఖైదీ శాటిలైట్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఛానెల్ రూ. 13 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఏరియాల వారీగా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులు రూ.8.5 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 14 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైన విషయం తెలిసిందే. ఇక రీసెంట్‌గా తెలుగు సినిమా మార్కెట్ కీల‌క‌మైన నైజాం రైట్స్ రూ.14 కోట్ల‌కు అమ్ముడై స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది.


ఎలా ఉందో అలాగే రిలీజ్..

ఎలా ఉందో అలాగే రిలీజ్..

ఖైదీ నెం.150 సెన్సార్ కూడా పూర్త‌యి, తొలి కాపీ సిద్ధంగా ఉంది. ఈ సినిమా నిడివి దాదాపు రెండున్న‌ర గంట‌లుగా తేలింది. ఈరోజుల్లో రెండున్న‌ర గంట‌లంటే పెద్ద సినిమానే. అందులో కొన్ని స‌న్నివేశాల్ని ట్రిమ్ చేసే అవ‌కాశాలేమైనా ఉన్నాయా అంటూ చ‌ర‌ణ్‌, వినాయ‌క్ సుదీర్ఘంగా ఆలోచిస్తూంటే...‌.చిరంజీవి మాత్రం "క‌టింగులు వొద్దు.. ఎలా ఉందో అలానే రిలీజ్ చేయండి" అంటూ స్ట్రాంగ్ గా చెప్పేశాడ‌ట‌.


పక్కా మాస్ మసాలా

పక్కా మాస్ మసాలా

ఇక అన్నీ కుదిరి ఈ సినిమా హిట్ అయితే గ‌న‌క బాహుబ‌లి మిన‌హా మిగిలిన రికార్డుల‌న్నీ తాను కొట్టేయ‌డం గ్యారెంటీ అనే న‌మ్మ‌కంతో ఉన్నాడ‌ట చిరంజీవి. దీనికి త‌గ్గ‌ట్లే ఖైదీ నెం. 150ని ప‌క్కా మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిస్తున్నాడు వినాయ‌క్.


 వినాయిక్ పై ప్రశంసలు జల్లు

వినాయిక్ పై ప్రశంసలు జల్లు

ఖైదీ నెం.150 ఫైన‌ల్ అవుట్ పుట్ విష‌యంలో చిరంజీవి పూర్తి సాటిస్ ఫేక్షన్ తో... ఫుల్ ఖుషీగా ఉన్నాడ‌ని, అనుకొన్న‌ది అనుకొన్న‌ట్టు తీసినందుకు వినాయ‌క్‌పై ప్ర‌సంశ‌ల జ‌ల్లు కురిపించాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.


బాగా క్లిక్ అయ్యాయి...

బాగా క్లిక్ అయ్యాయి...

వివి వినాయిక్ మాస్ ప‌ల్స్ తెలిసిన దర్సకుడు కావటంతో.. డాన్సులు, పాట‌లు, మసాలా సీన్ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి నిలిపాడ‌ని, అవి బాగా క్లిక్క‌య్యాయ‌ని, పాట‌లు..సెట్లు, డాన్సుల విష‌యంలో చిరు, వినాయ‌క్‌లు తీసుకొన్న శ్ర‌ద్ధ వ‌ల్ల ఈ సినిమా మ‌రింత ప్ర‌త్యేకంగా త‌యారైంద‌ని చెబుతున్నారు.


ట్రైలర్ కటింగ్

ట్రైలర్ కటింగ్

ట్రైల‌ర్ క‌ట్ విష‌యంలో చిరు ప్ర‌త్యేక ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ని, ట్రైల‌ర్‌తోనే హైప్ క్రియేట్ చేయాల‌ని, ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాపై ఉన్న నెగిటివ్ ఫీలింగ్ అంతా పోవాల‌ని చిరంజీవి భావిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పలు సూచనలు టీమ్ కు చేసినట్లు తెలుస్తోంది.


కొత్తగా కట్ చేస్తున్నారు

కొత్తగా కట్ చేస్తున్నారు

ఇప్ప‌టికే ట్రైల‌ర్ రెడీ అయ్యింద‌ని, చిరు కొన్ని మార్పులూ చేర్పులూ సూచించ‌డంతో.. ట్రైల‌ర్‌ని మ‌ళ్లీ కొత్త‌గా క‌ట్ చేయ‌డం మొద‌లెట్టార‌ని, ఈనెల 7న గుంటూరులో జ‌రిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైల‌ర్‌ని ప్ర‌ద‌ర్శిస్తార‌ని టాక్‌.


హవా మొదలైంది

హవా మొదలైంది

మొత్తానికి.. మెగాస్టార్ హవా మళ్లీ మొదలైనట్టు క్లియర్‌గా కనిపిస్తోంది. కాగా, వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెం.150 లో చిరంజీవి సరసన కాజల్ జతకట్టనుంది. రాయ్ లక్ష్మీ ఐటమ్ సాంగ్‌లో మెరవనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. రాంచరణ్ నిర్మాత. మెగా ఖైదీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


అనుకున్నారు కానీ..

అనుకున్నారు కానీ..

'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వేదిక, ముహూర్తం ఖారారయ్యాయి. ఈ నెల 11వ తేదీన ఈ ఫంక్షన్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో జరపాలని నిర్వాహకులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ ఫంక్షన్‌ను ఇటు హైదరాబాద్‌లో కానీ, అటు విశాఖపట్నంలో కానీ నిర్వహించకుండా.. ఏపీ నూతన రాజధాని ప్రాంతమైన విజయవాడ స్టేడియంలో నిర్వహించాలని భావించారు.


అందుకే హాయ్ లాండ్ కు

అందుకే హాయ్ లాండ్ కు

విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రీ రిలీజ్ వేడకకు అనుమతి ఇవ్వలేదు. స్టేడియంలో ఫంక్షన్ల నిర్వహణకు సంబంధించి కోర్టు షరతులు ఉన్న నేపథ్యంలో, పర్మిషన్ ఇవ్వలేకపోయారు. దీంతో.. గుంటూరులోని స్టేడియంలో ఫంక్షన్ నిర్వహించాలనుకున్నారు. అక్కడ కూడా అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. చేసేది ఏమి లేక వేదికను హాయ్ ల్యాండ్‌కు మార్చారు నిర్వాహకులు.


కుట్ర ..తీవ్ర పరిణామాలు..

కుట్ర ..తీవ్ర పరిణామాలు..

ప్రీ రిలీజ్ వేదిక మార్పుపై చిరు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక కుట్ర ప్రకారమే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు. ఫంక్షన్ జరగకుండా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఫంక్షన్ ను నిర్వహించి తీరాలనే యోచనలో నిర్వాహకులు, అభిమానులు ఉన్నారు.


చిరు స్టామినా ఏంటనేది

చిరు స్టామినా ఏంటనేది

చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 రిలీజ్ కు దగ్గర పడుతున్న నేపధ్యంలో మరోసారి ఓవర్ సీస్ మార్కెట్ గురించి భారీ ఎత్తున చర్చ మొదలైంది. చిరంజీవి ఓవర్ సీస్ లో దుమ్ము రేపుతాడా...ఏం జరుగుతోంది అనే విషయమై రచ్చ జరుగుతోంది...ఇక్కడ లింక్ లో ఆ వివరాలు చూడవచ్చు


ఇండస్ట్రీ షాక్ : మెగా ఎంట్రీ...'బాహుబలి' తో సహా మొత్తం స్టార్ హీరోల రికార్డ్ లు బ్రద్దలు


English summary
There is enormous craze for the theatrical rights of 'Khaidii No.150'. Business in all the areas have been closed for sky-high prices.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu