యూఎస్ఏలో ‘మహానటి’ ప్రభంజనం: 2 మిలియన్ దిశగా..

By Bojja Kumar

Recommended Video

'Mahanati' To Join 2 Million Club At Us Box Office Soon

కీర్తీ సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సావిత్రి బయోపిక్ 'మహానటి' యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. మే 9న విడుదలైన ఈ చిత్రం శనివారం నాటికి $1.28 మిలియన్ క్రాస్ అయింది. త్వరలోనే ఈ మూవీ $2 మిలియన్ క్లబ్‌లో చేరడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఆస్ట్రేలియా, యూకె, కెనడా, న్యూజిలాండ్ ఏరియాల్లో సైతం 'మహానటి' బాక్సాఫీస్ కలెక్షన్స్ అదిరిపోయే విధంగా ఉన్నాయి.

తరణ్ ఆదర్శర్ ట్వీట్

ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ‘మహానటి' యూఎస్ఏ కలెక్షన్స్ వివరాలు వెల్లడించారు. ఈ చిత్రం అమెరికాలో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోందని, త్వరలోనే 2 మిలియన్ డాలర్ మార్కను అందుకుంటుందని తెలిపారు.

 142 లొకేషన్లలో మహానటి

142 లొకేషన్లలో మహానటి

‘మహానటి' చిత్రం యూఎస్ఏ వ్యాప్తంగా 142 లొకేషన్లలో ప్రదర్శిస్తున్నారు. అన్ని ఏరియాల్లో ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. ప్రీమియర్ షోలతో కలిపి బుధ, గురు వారాల్లో $ 637,737 వసూలు చేసింది. శుక్రవారం $ 251,125 వసూలు చేయగా, శనివారం $ 396,236 రాబట్టింది. ఆదివారం వసూళ్ల వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ నెంబర్స్ యాడ్ అయితే ఓవరాల్ కలెక్షన్ 1.5 మిలియన్ మార్కను క్రాస్ అవుతుంది.

కెనడాలో కూడా సాలిడ్ రన్

కెనడాలో కూడా ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు సాధిస్తోందని తరణ్ ఆదర్శ్ తెలిపారు.

యూకె, న్యూజిలాండ్

యూకె, న్యూజిలాండ్‌లో మహానటి కలెక్షన్స్ వివరాలు తరణ్ ఆదర్శ్ ప్రకటించారు.

ఆస్ట్రేలియాలో...

యూఎస్ఏ తర్వాత ఆస్ట్రేలియాలో మహానటి చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. శనివారం వరకు ఈ చిత్రం ఓవరాల్‌గా ఇక్కడ రూ. 64 లక్షలు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X