‘అజ్ఞాతవాసి’ రికార్డును బద్దలు కొట్టిన ‘మహానటి’

By Bojja Kumar

ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. ముఖ్యంగా యూఎస్ఏలో ఈ చిత్రం సూపర్బ్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. ఇప్పటికే ఇక్కడ 2 మిలియన్ డాలర్ మార్కును క్రాస్ చేసిన ఈచిత్రం తాజాగా 'అజ్ఞాతవాసి' రికార్డును అధిగమించింది.

కీర్తి సురేష్ నటించిన గత చిత్రం 'అజ్ఞాతవాసి' లైఫ్ టైమ్ రన్‌లో $2,065,527 వసూలు చేయగా.... 'మహానటి' మూవీ $2,172,889 వసూలు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టింది. సినిమా విడుదలైన రెండు వారాలైనా యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఈ మూవీ మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తుండటం గమనార్హం.

USA Boxoffice: Mahanati Overtakes Agnyaathavaasi

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహానటి' చిత్రం మే 9న విడుదలైంది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో నటించగా దుల్కర్ సల్మాన్ సావిత్రా భర్త జెమినీ గణేశన్‌ పాత్రను పోషించారు. సావిత్రి చిన్నతనం నుండి మహానటిగా ఆమె ఎలా ఎదిగారు, 45 ఏళ్ల వయసులోనే ఆమె జీవితం ఎలా ముగిసింది అనే విషయాలన్నీ ఈ సినిమాలో చూపించారు.

స్టార్ హీరోయిన్ సమంత ఈ మూవీలో జర్నలిస్టు మధురవాణి పాత్ర పోషించారు. ఆమెతో పాటు ఉండే ప్రెస్ ఫోటోగ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. వీరితో పాటు మోహన్ బాబు ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రల్లో మెరిశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X