twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ranga Ranga Vaibhavanga Collections: 2వ రోజే బిగ్ షాక్.. మరీ ఇంత తక్కువా.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్ల వారసులు హీరోలుగా పరిచయం అవుతున్నారు. అందులో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది కుర్రాళ్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో మొదటి చిత్రంతోనే యాభై కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి.. గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్నది మాత్రం పంజా వైష్ణవ్ తేజ్ మాత్రమే. ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ కుర్రాడు.. తాజాగా 'రంగరంగ వైభవంగా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

    ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రావడం లేదు. దీంతో కలెక్షన్లు కూడా అంతగా రావడం లేదు. ఈ నేపథ్యంలో 'రంగరంగ వైభవంగా' 2 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

    రంగరంగ వైభవంగా వచ్చాడుగా

    రంగరంగ వైభవంగా వచ్చాడుగా

    పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనరే 'రంగరంగ వైభవంగా'. ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ మూవీలో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.

    JGM: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు మరో షాక్.. జనగణమనపై పూరీ జగన్నాథ్ సంచలన నిర్ణయంJGM: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు మరో షాక్.. జనగణమనపై పూరీ జగన్నాథ్ సంచలన నిర్ణయం

     రంగరంగ వైభవంగాకు బిజినెస్

    రంగరంగ వైభవంగాకు బిజినెస్

    వైష్ణవ్ తేజ్ 'రంగరంగ వైభవంగా' మూవీకి నైజాంలో రూ. 2.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 3.60 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌ ఏరియాల్లో కలిపి రూ. 1 కోటి బిజినెస్ అయింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 8.50 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

    2వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    2వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    'రంగరంగ వైభవంగా'కి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు భారీ దెబ్బ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 21 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. ఏపీ, తెలంగాణలో రూ. 56 లక్షలు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

    వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!

    2 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది

    2 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది

    'రంగరంగ వైభవంగా'కి ఏపీ, టీఎస్‌లో రెండో రోజుల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 52 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 20 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలుపుకుని రూ. 1.52 కోట్లు షేర్, రూ. 2.65 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో కేవలం రూ. 1.52 కోట్లు రాబట్టిన 'రంగరంగ వైభవంగా' ప్రపంచ వ్యాప్తంగా నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 2 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.83 కోట్లు షేర్‌తో పాటు రూ. 3.30 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఊహించని హాట్ షోయాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఊహించని హాట్ షో

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ జంటగా రూపొందిన 'రంగరంగ వైభవంగా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 1.83 కోట్లు వచ్చాయి. అంటే మరో 7.17 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

     రెండు రోజుల్లో మరీ తక్కువగానే

    రెండు రోజుల్లో మరీ తక్కువగానే

    'రంగరంగ వైభవంగా' మూవీ ఎన్నో అంచనాలతో వచ్చినా నిరాశను కలిగించేలా మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఫలితంగా ఆంధ్రా, తెలంగాణలో అంతగా రాణించడం లేదు. దీనికి రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ వసూళ్లే వచ్చాయి. ఇక, సండే కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఈ చిత్రానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

    English summary
    Vaishnav Tej Did Ranga Ranga Vaibhavanga Movie Under Gireeshaaya Direction. This Movie Collects Rs 1.83 Crore in 2 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X