వైష్ణవ్ తేజ్కు అందరికంటె ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్న స్టార్ హీరో.. ఆ హీరోలతో సమానంగా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. మెగా వారసత్వం నుంచి వచ్చినప్పటికీ సేఫ్ జోన్ లో కాకుండా ఒక ప్రయోగాత్మకమైన కథను ఎంపిక చేసుకోవడం అందరికి షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం అతను చేస్తున్న సినిమాలకు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుతోంది. ఇక నాగార్జున హోమ్ ప్రొడక్షన్ లో తెరకెక్కబోయే సినిమాకు కూడా సాలీడ్ రెమ్యునరేషన్ అందుతున్నట్లు సమాచారం.

ఉప్పెనతో సాలీడ్ రికార్డు
వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వరల్డ్ వైడ్ 50కోట్లకు పైగా షేర్ అందించి సరికొత్త రికార్డిను క్రియేట్ చేసింది. కలెక్షన్స్ నెంబర్ల పరంగా ఇప్పటివరకు ఏ హీరో కూడా మొదటి సినిమాతో ఈ రేంజ్ లో రికార్డును అందుకోలేదు. మొత్తానికి వైష్ణవ్ గ్రాండ్ ఎంట్రితో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు.

ఉప్పెన రెమ్యునరేషన్
ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. అందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆ సినిమాను థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఆ సినిమాకు కూడా వైష్ణవ్ ఒక కోటి ల లోపే రెమ్యునరేషన్ ఆందుకున్నట్లు సమాచారం.

మూడవ సినిమాకు ఎంతంటే
ఇక అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్ లో రీమేక్ చేసిన గిరిషయ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను ఒకే చేశాడు. ఆ సినిమాను సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆ సినిమాకు వరుణ్ 3 కోట్ల వరకు అందుకుంటున్నట్లు కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఉప్పెన అనంతరం వైష్ణవ్ తేజ్ కు అడ్వాన్స్ ఇవ్వడానికి చాలామంది నిర్మాతలు వచ్చారు.

అడ్వాన్స్ లకు టెంప్ట్ అవ్వకుండా
ఇక వైష్ణవ్ ఎక్కువగా అడ్వాన్స్ లకు టెంప్ట్ అవ్వకుండా ముందు కథ సెట్ చేస్తేనే ఒప్పుకుంటున్నాడట. వీలైనంత వరకు తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇక నాగార్జున మీద గౌరవంతో ముందే కథ వినకపోయినా కూడా కమిట్మెంట్ ఇచ్చాడని తెలుస్తోంది.
Recommended Video

అందరికంటే ఎక్కువగా
వైష్ణవ్ కోసం అనుకున్న కథ త్వరలోనే ఫుల్ స్క్రిప్ట్ తో సిద్ధమవుతుందట. ఇక అందరికంటే ఎక్కువగా వైష్ణవ్ కు 5కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. అంటే దాదాపు ప్రస్తుతం ఉన్న మీడియం రేంజ్ హీరోలకు సమానమని చెప్పవచ్చు. నాగార్జున, అన్నపూర్ణ ప్రొడక్షన్ లో సినిమాలు నిర్మించి చాలా కాలమయ్యింది. ఇక వైష్ణవ్ తేజ్ తో ఎలాగైనా ఒక మంచి ప్రేమ కథతో హిట్టు కొట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











