Uppena 3 days collections: టార్గెట్ పూర్తి చేసిన వైష్ణవ్ తేజ్.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే?
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రెండవ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా మొత్తానికి పవర్ఫుల్ బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. మెగా ఫ్యామిలీ ఇదే బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అని చెప్పవచ్చు. రామ్ చరణ్ చిరుత రికార్డును కూడా వైష్ణవ్ చాలా ఈజీగా దాటేసి మంచి హిట్ అందుకున్నాడు. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఉప్పెన అదే ఉపుతో విడుదల తరువాత కూడా కలెక్షన్స్ తో మరింత బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక మూడవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే..

కలెక్షన్స్ హవా ఏ మాత్రం తగ్గడం లేదు
సంక్రాంతికి మాస్ కమర్షియల్ సినిమాలు బాగానే హడావుడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు అందరి చూపు ఉప్పెనపైనే ఉంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూందని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. మొదటి రోజు నుంచి కూడా కలెక్షన్స్ హవా ఏ మాత్రం తగ్గడం లేదు. అన్ని వర్గాల ఆడియెన్స్ కు సినిమా ఎమోషనల్ టచ్ ను ఇచ్చింది.

3వ రోజు కలెక్షన్స్..
ఉప్పెన రెండవ రోజు కంటే కూడా మూడవ రోజు కాస్త ఎక్కువ షేర్స్ అందుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ ఓపెనింగ్స్ లలో ఉప్పెన న్యూ రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఏరియాల వారికి కలెక్షన్స్ (షేర్స్) చూసుకుంటే నైజం 2.93కోట్లు, సీడెడ్ 1.31కోట్లు, ఉత్తరాంధ్ర 1.45కోట్లు, ఈస్ట్ 74లక్షలు, వెస్ట్ 40.3లక్షలు, గుంటూర్ 48లక్షలు, కృష్ణ 65లక్షలు, నెల్లూరు 28.4లక్షలు.

మూడు రోజుల్లో మొత్తం వచ్చిన షేర్స్..
ఉప్పెన సినిమాకు మూడవ రోజు వచ్చిన మొత్తం కలెక్షన్స్. 8.26కోట్లు. ఇక మొదటి రోజే 9.35కోట్ల వరకు అందుకున్న ఈ సినిమా రెండవ రోజు 6.86కోట్ల షేర్స్ ను అందుకుంది. ఈ విధంగా మొత్తం మూడు రోజుల కలెక్షన్స్ ఎపి తెలంగాణలోనే 24.47కోట్లు వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన షేర్స్ 26కోట్లని తెలుస్తోంది.
Recommended Video

టార్గెట్ ఫినిష్..
వరల్డ్ వైడ్ గా మొత్తంగా సినిమా 20.5కోట్ల బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21కోట్లు. ప్రస్తుతం వచ్చిన 26కోట్ల షేర్స్ తో సినిమా అసలు టార్గెట్ ను పూర్తి చేసింది. ఇంకా 5కోట్ల ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది కూడా. అంతే కాకుండా ఈ సినిమాతో అత్యదిక వసూళ్లను అందుకున్న మొదటి సినిమా హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డ్ సృస్టించాడు కూడా.


Click it and Unblock the Notifications











