»   » మరో చరిత్రకి సరైన పోటీ వరుడు(ట్రేడ్ టాక్)

మరో చరిత్రకి సరైన పోటీ వరుడు(ట్రేడ్ టాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రిందటి వారం మూడు చిత్రాలు తెలుగు తెరను పలకరించాయి. అందులో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన వరుడు, వడ్డే నవీన్, సంగీతల శ్రీమతి కళ్యాణం, అనగనగా ఒక అరణ్యం. వీటిలో బాగా హైప్ తో వచ్చిన చిత్రం వరుడు. గుణశేఖర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఐదు రోజుల పెళ్ళి నేపధ్యంలో రామాయణాన్ని స్పూర్తిగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లోనే అధ్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రంగానూ చెప్తున్నారు. అలాగే నవీన్, సంగీతల శ్రీమతి కళ్యాణం అర్దం పర్ధం లేని ముతక కథతో బోరుకొట్టే స్క్రీన్ ప్లే రిలీజైన మొదటి షోకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా దర్శకత్వ లోపం ఈ చిత్రాన్ని దెబ్బ కొట్టిది. ఇక అనగనగా ఒక అరణ్యం రిలీజైందన్న విషయం కూడా తెలియనంత పబ్లిసిటీతో విడుదల చేసారు. వెళ్ళిన కొద్ది మందీ ధియోటర్లో ఏసీ కోసమే వెళ్ళామని చెప్పుకునే పరిస్దితి. వీటికి తోడు దిల్ రాజు ఎంతగానో మొత్తుకుంటున్న మరో చరిత్ర చిత్రం కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. ఇక హైపు చేసి ప్లాపు కొట్టిన రికార్డులో మరో చరిత్రకి పోటీగా వరుడు నిలిచింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu