Don't Miss!
- News
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Varudu Kavalenu Total Collections..బాక్సాఫీస్ వద్ద ఎంత రాబట్టిందంటే.. హిట్టా? ఫట్టా?
సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై యువ హీరో నాగశౌర్య, రీతూవర్మ జంటగా యువ నిర్మాత నాగవంశీ రూపొందించిన వరుడు కావలెను చిత్రం అక్టోబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తొలి వారాంతం వరకు మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తడబాటును సొంతం చేసుకొన్నది. అయితే గత 18 రోజుల్లో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
వరుడు కావలెను సినిమా టీజర్లు, ట్రైలర్లు ఆసక్తిని రేకెత్తించడంతో రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్ సొంతం చేసుకొన్నది. దాదాపు 9 కోట్ల రూపాయల టార్గెట్‌తో బాక్సాఫీస్ ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది.

నైజాంలో ఈ చిత్రం 1.35 కోట్లు, సీడెడ్‌లో 53 లక్షలు, ఉత్తరాంధ్రలో 34 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.34 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.26 లక్షలు, గుంటూరులో 38 లక్షలు, కృష్ణా జిల్లాలో 36 లక్షలు, నెల్లూరులో 22 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఏపీ, నైజాం ప్రాంతాల్లో రూ.3.88 కోట్లు నికరంగా, రూ.6.45 కోట్లు గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కాకుండా.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.23 లక్షలు రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.1 కోటి రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రూ.5.10 కోట్లు నికరంగా, రూ.8.75 కోట్లు గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారు 4 కోట్ల మేర నష్టాలతో బాక్సాఫీస్ రన్‌ను ముగించింది.