»   » ఓవర్సీస్‌లో తొలిప్రేమ కాసుల వర్షం.. వరుణ్ తేజ్ సరికొత్త రికార్డు

ఓవర్సీస్‌లో తొలిప్రేమ కాసుల వర్షం.. వరుణ్ తేజ్ సరికొత్త రికార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా హీరో వరుణ్ తేజ్, అందాల తార రాశీఖన్నా కలిసి నటించిన తొలిప్రేమ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతున్నది. తన కెరీర్‌లోనే ఉత్తమ కలెక్షన్లు సాధించిన చిత్రంగా వరుణ్ తేజ్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తున్నది.

Tholi Prema 1st Day Collections
 17 కోట్లు వసూలు

17 కోట్లు వసూలు

ప్రపంచవ్యాప్తంగా తొలిప్రేమ చిత్రం తొలి వారాంతానికి సుమారు రూ.17 కోట్లు రాబట్టింది. అమెరికా బాక్సాఫీస్ వద్ద టాప్ 25 చిత్రాల జాబితాలో ఈ చిత్రం చోటు సంపాదించింది. వారాంతం తర్వాత కూడా కలెక్షన్లతో తగ్గుదల లేకపోవడం సినిమా స్టామినాకు అద్దం పట్టింది.

అమెరికాలో భారీ కలెక్షన్లు

అమెరికాలో భారీ కలెక్షన్లు

అమెరికాలో గురువారం ప్రదర్శించిన ప్రీమియర్ షోలకు రూ.98 లక్షలు వసూలైంది. శుక్రవారం రూ.1.8 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
ఇతర రాష్ట్రాల్లో రూ.86 లక్షలు వసూలు చేసింది.

 తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో తొలి రెండు రోజుల్లో తొలిప్రేమ చిత్రం 6.20 కోట్ల నికర వసూళ్లను సాధించింది. నైజాంలో శుక్ర, శనివారాల్లో రూ.2.31 కోట్లు, సీడెడ్‌లో 74 లక్షలు సాధించింది.

 జిల్లాలో కాసులు వర్షం

జిల్లాలో కాసులు వర్షం

ఏపీలోని నెల్లూరు జిల్లాలో 22 లక్షలు, గుంటూరులో 62 లక్షలు, క‌ృష్ణాలో రూ.53 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 44 లక్షలు, తూర్పులో 48 లక్షల రూపాయలను కొల్లగొట్టింది.

English summary
Varun Tej and Raashi Khanna’s romantic film Tholi Prema has begun its run at the box office on a high note. With the help of positive reviews and great word of mouth, the film has made a dent at the box office, picking up Rs 17 crore in its first weekend worldwide collections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu