For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఫీషియల్ : ' కంచె' యుఎస్ కలెక్షన్స్ రిపోర్ట్

  By Srikanya
  |

  హైదరాబాద్ : వరుణ్ తేజ హీరోగా నటించిన చిత్రం ' కంచె' . ఈ చిత్రం అక్టోబర్ 22న న విజయ దశమి సందర్బంగా విడుదల అయ్యింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ ఓ సైనికుడి పాత్రలో కన్పించారు. ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం యుఎస్ లో మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ కలెక్షన్స్ గురించి కంచె టీమ్ అఫీషియల్ గా ఫేస్ బుక్ ద్వారా తెలియచేసారు. ఆ పోస్ట్ ని ఇక్కడ చూడండి.

  Successfully crossed half a million mark in the USANow in cinemas near you: http://bit.ly/KancheTickets

  Posted by Kanche on 2 November 2015

  ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం...ఈ చిత్రాన్ని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కోటి పాతిక లక్షలు రూపాయలు పెట్టి సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకూ $501k గ్రాస్ కలెక్షన్ వచ్చిందని తెలుస్తోంది. దాంతో యుఎస్ డిస్ట్రిబ్యూటర్ మంచి లాభం సంపాదించినట్లైంది. సినిమాకు మంచి రివ్యూలు రావటంతో యుఎస్ కలెక్షన్స్ బాగున్నాయి.

  ఓవర్ సీస్ లో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోకి ప్రవేశించిన "Absolute Telugu Cinemas" వారు ఈ చిత్రం రైట్స్ ని కోటి పాతిక లక్షలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ కంపెనీని కొంతమంది ఎగ్జిబిటర్స్ కలిసి ఏర్పాటు చేసుకున్నారు.

  Varun teja's Kanche Grossed half million dollars in USA

  చిత్రం కథేమిటంటే...

  రెండు విభిన్న కథలను ఒకే బ్యాక్ డ్రాప్ లో చెప్పాలని ప్రయత్నించిన చిత్రం ఇది. ధూపాటి హరిబాబు(వరుణ్ తేజ) రెండో ప్రపంచ యుద్దం(1944)లో జర్మనీకి వ్యతిరేకంగా పోరాడే ఓ సైనికుడు. అతని కమాండర్ ఈశ్వర్ (నిక్తిన్ ధీర్). ఓ సమయంలో జర్మన్ ఆర్మీ దాడి జరిపి..ఈశ్వర్ ని అతనితో పాటు ఉన్న వారిని ఎత్తుకుపోతారు. అయితే హరిబాబుకు , కమాండర్ ఈశ్వర్ కు ఇంతకు ముందే(1936) పరిచయం ఉంటుంది.

  ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే...రాచకొండ సంస్దానాధినేత ఈశ్వర్ కు ఓ చెల్లెలు సీతాదేవి(ప్రగ్యాజైస్వాల్). సీతాదేవి, హరిబాబు ప్రేమించుకుంటారు. అయితే హరిబాబుది నిమ్న కులం కావటంతో ఊళ్లో గొడవలు భగ్గుమంటాయి. వారి ప్రేమ ప్రక్కన పెడితే ఇప్పుడు హరిబాబు... తన కమాండర్ ని,మిగతా వారిని రక్షించాడా..లేక గతం గుర్తు పెట్టుకుని వదిలాసాడా....సీతాదేవితో హరిబాబు ప్రేమ కథ ఏమైంది అనేది మిగతా సినిమా.

  తొలి చిత్రం గమ్యం నుంచీ దర్శకుడు క్రిష్..విభిన్న తరహా కధాంశాలకే ఓటు వేస్తూ వచ్చాడు. అలాగే ఈ సారి కూడా సెకండ్ వరల్డ్ వార్ నేపధ్యం తీసుకుని అక్కడ విద్వేషాల కంచెను చూపుతూ...దానికి ప్యారలల్ గా మన ఊళ్లను ముడిపెడుతూ ఇక్కడ ఊళ్ల మధ్య కులాల కంచె ఉందని ..ఈ రెండిటినీ విడిచిపెడితేనే మనిషి ప్రశాంతంగా బ్రతుకుతాడని చెప్పాలనే ఆలోచనతో చేసాడు. మరీ ఆరు పాటలు, ఐదు ఫైట్స్, బ్రహ్మానందం కామెడీ అనే రొటీన్ తెలుగు సినిమాకు ఇది మాత్రం ఆసక్తి కలిగించే కొత్త పరిణామం. ఇందుకు దర్శక,నిర్మాతలను అభినందించాలి. ముఖ్యంగా అప్పటి భారతదేశాన్ని చూడాలనుకునేవారికి ఇది బాగా నచ్చుతుంది.

  English summary
  Kanche has crossed more than half million dollars in USA. Directed by Krish, Kanche has become the first World War II movie in Tollywood.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X