For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'కంచె ': కొత్త సీన్స్ కలుపుతున్నారు

  By Srikanya
  |

  హైదరాబాద్ : దసరా కానుకగా విడుదలైన క్రిష్ చిత్రం 'కంచె 'కు ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 23 నుంచీ కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు గంటల ఐదు నిముషాలు రన్ టైమ్ ఉన్న ఈ సినిమా దాంతో లెంగ్త్ పెరగనుంది. సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యాక రన్ టైమ్ తగ్గించటానికి ట్రిమ్ చేసి అనవసర సీన్స్ కట్ చేస్తూంటారు. అయితే 'కంచె ' కు రివర్స్ లోజరుగుతోంది. సీన్స్ రెండో రోజుకే కలపుతున్నారు. చిత్రం షేర్ ఇరవై కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.అలాగే కొన్ని ప్రాంతాల్లో స్క్రీన్స్ సైతం పెరుగుతున్నట్లు వినికిడి.

  చిత్రం కథేమిటంటే...

  రెండు విభిన్న కథలను ఒకే బ్యాక్ డ్రాప్ లో చెప్పాలని ప్రయత్నించిన చిత్రం ఇది. ధూపాటి హరిబాబు(వరుణ్ తేజ) రెండో ప్రపంచ యుద్దం(1944)లో జర్మనీకి వ్యతిరేకంగా పోరాడే ఓ సైనికుడు. అతని కమాండర్ ఈశ్వర్ (నిక్తిన్ ధీర్). ఓ సమయంలో జర్మన్ ఆర్మీ దాడి జరిపి..ఈశ్వర్ ని అతనితో పాటు ఉన్న వారిని ఎత్తుకుపోతారు. అయితే హరిబాబుకు , కమాండర్ ఈశ్వర్ కు ఇంతకు ముందే(1936) పరిచయం ఉంటుంది.

  Varun Teja's Kanche:Run Time increased on Day 2

  ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే...రాచకొండ సంస్దానాధినేత ఈశ్వర్ కు ఓ చెల్లెలు సీతాదేవి(ప్రగ్యాజైస్వాల్). సీతాదేవి, హరిబాబు ప్రేమించుకుంటారు. అయితే హరిబాబుది నిమ్న కులం కావటంతో ఊళ్లో గొడవలు భగ్గుమంటాయి. వారి ప్రేమ ప్రక్కన పెడితే ఇప్పుడు హరిబాబు... తన కమాండర్ ని,మిగతా వారిని రక్షించాడా..లేక గతం గుర్తు పెట్టుకుని వదిలాసాడా....సీతాదేవితో హరిబాబు ప్రేమ కథ ఏమైంది అనేది మిగతా సినిమా.

  తొలి చిత్రం గమ్యం నుంచీ దర్శకుడు క్రిష్..విభిన్న తరహా కధాంశాలకే ఓటు వేస్తూ వచ్చాడు. అలాగే ఈ సారి కూడా సెకండ్ వరల్డ్ వార్ నేపధ్యం తీసుకుని అక్కడ విద్వేషాల కంచెను చూపుతూ...దానికి ప్యారలల్ గా మన ఊళ్లను ముడిపెడుతూ ఇక్కడ ఊళ్ల మధ్య కులాల కంచె ఉందని ..ఈ రెండిటినీ విడిచిపెడితేనే మనిషి ప్రశాంతంగా బ్రతుకుతాడని చెప్పాలనే ఆలోచనతో చేసాడు.

  మరీ ఆరు పాటలు, ఐదు ఫైట్స్, బ్రహ్మానందం కామెడీ అనే రొటీన్ తెలుగు సినిమాకు ఇది మాత్రం ఆసక్తి కలిగించే కొత్త పరిణామం. ఇందుకు దర్శక,నిర్మాతలను అభినందించాలి. ముఖ్యంగా అప్పటి భారతదేశాన్ని చూడాలనుకునేవారికి ఇది బాగా నచ్చుతుంది.

  English summary
  'Kanche' makers to add few more scenes to the movie. These additional scenes will enthrall the audience from Today (October 23rd) itself.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X