Don't Miss!
- News
డీఎంకే ప్రభుత్వ పెద్దలతో ఏపీ మంత్రులు- చెన్నైలో కీలక భేటీ..!!
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Sports
పెళ్లితో ఒక్కటయ్యాం.. ఆశీర్వదించండి: కేఎల్ రాహుల్
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Advance Bookings: ఓవర్సీస్ లో చిరు, బాలయ్య బాక్సాఫీస్ యుద్ధం.. రేస్ లో ఎవరు ముందున్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా అలాగే నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి రెండు సినిమాలు కూడా ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలలో ఏ సినిమా అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అనే విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఎవరు పై చేయి సాధిస్తున్నారు అన్నది కూడా ఇప్పుడు వైరల్ అవుతొంది. ఇప్పటికే కొన్ని ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇక ఎవరు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకోబోతున్నారు అనే వివరాల్లోకి వెళితే..

వింటేజ్ చిరు
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. బాబీ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. పూర్తిస్థాయిలో మాస్ కమర్షియల్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.

బాలయ్య యాక్షన్ మాస్
ఇక మరోవైపు వాల్తేరు వీరయ్య పోటీగా నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా సంక్రాంతిలో ఢీకొట్టబోతోంది. ఈ సినిమా చిరు సినిమా కంటే ఒకరోజు ముందుగానే జనవరి 12వ తేదీన విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ సినిమాను దర్శకుడు గోపిచంద్ మలినేని యాక్షన్ మాస్ కమర్షియల్ మూవీగా తెరపైకి తీసుకువచ్చాడు.

వీర సింహారెడ్డి కలెక్షన్స్
ఇక ఓవర్సీస్ లో రెండు సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉందని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అర్థమవుతుంది. ఇక యూఎస్ లో కూడా ఈ రెండు సినిమాలు కూడా మంచి బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. వీర సింహారెడ్డి 210 లొకేషన్స్ విడుదలవుతుండగా 466 షోలకు సంబంధించి ఇప్పటికే 14179 టికెట్లు అమ్ముడయ్యాయి. అంటే ఈ సినిమాకు 276, 218 డాలర్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్య లెక్కలు
ఇక వాల్తేరు వీరయ్య సినిమా గురించి చూసుకుంటే ఈ సినిమాను మొత్తం 185 లోకేషన్స్ లో విడుదల చేస్తుండగా 409 షోలను సంబంధించిన టికెట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా అయితే ఇప్పటివరకు మెగాస్టార్ సినిమా కు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం ఉంటే 207, 883 డాలర్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది.

బాలయ్య దూకుడు
ఇక యూకే లో చూసుకుంటే నందమూరి బాలకృష్ణ వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు కూడా ఒకే రేంజ్ లో విడుదల కాబోతున్నాయి. ఇక బాలయ్య సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే 40 లొకేషన్స్ కు సంబంధించిన లెక్కలు బయటికి వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు 45 షోలకు 3600 టికెట్లు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమాకు 36 లొకేషన్స్ లలో 40 షోలకు 2300 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఫైట్ లో మెగాస్టార్ కంటే కూడా బాలయ్య ముందు వరుసలో కొనసాగుతున్నాడు.