Don't Miss!
- News
2023 ఎన్నికల ఫలితాలపై ఉండవల్లి అంచనాలు..!?
- Finance
Adani Cement: మూతపడ్డ అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలు..! అయోమయంలో 20 వేల కుటుంబాలు..
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Lifestyle
చలికాలంలో అల్లం తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి, ఎందుకో తెలుసా?
- Sports
Team India : టీమిండియా ముందున్న అతి పెద్ద సమస్య.. వరల్డ్ కప్ గెవాలంటే సమస్య తీరాల్సిందే!
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Veera Simha Reddy: యూఎస్‌లో బాలకృష్ణ ఆల్ టైం రికార్డు.. ఏకంగా అన్ని కోట్లతో ఊచకోత
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో హీరోగా పరిచయమైనా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇదే ఉత్సాహాన్ని ఇప్పటికీ చూపిస్తోన్న ఆయన వరుస సినిమాలతో సందడి చేస్తోన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ నందమూరి హీరో 'వీర సింహా రెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే యూఎస్‌లో రికార్డు సాధించింది. ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన పవర్‌ఫుల్ మూవీనే 'వీర సింహా రెడ్డి'. ఈ యాక్షన్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు నటించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ దీనికి మ్యూజిక్‌ను ఇచ్చాడు.
ఘాటు ఫొటోతో టెంప్ట్ చేస్తోన్న దీప్తి సునైనా: కింది నుంచి చూపిస్తూ హాట్‌గా!

బాలయ్య కెరీర్‌లోనే భారీగా
పవర్‌ఫుల్ కాన్సెప్టుతో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడిపోయాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ నందమూరి అభిమానులతో మోత మోగుతూ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి.

టాక్ అలా.. రెస్పాన్స్ ఇలా
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం ఏవరేజ్‌గా నిలుస్తుందని, ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ సరిగా ఉండదని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా నైట్ షోలు ఫుల్ అయిపోయాయి.
షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన నిధి అగర్వాల్: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటీ!

ఓపెనింగ్స్‌తోనే రికార్డులు
నందమూరి బాలయ్య - గోపీచంద్ కాంబోలో వచ్చిన 'వీర సింహా రెడ్డి' మూవీకి మొదటి రోజు టాక్‌తో సంబంధం లేకుండానే స్పందన మాత్రం భారీ స్థాయిలో వచ్చింది. ఫస్ట్ అండ్ సెకెండ్ షోలు కూడా హౌస్ ఫుల్ బోర్డులతో కనిపించాయి. దీంతో ఈ చిత్రానికి బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు దక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.

ప్రీ సేల్స్‌లోనే హాఫ్ దాటి
బాలయ్య
'వీర
సింహా
రెడ్డి'
ఓవర్సీస్
హక్కులను
శ్లోకా
ఎంటర్‌టైన్‌మెంట్స్
భారీ
ధరకు
సొంతం
చేసుకుంది.
దీంతో
ఈ
మూవీ
బుకింగ్స్
విడుదల
కంటే
ముందుగానే
ప్రారంభం
అయ్యాయి.
అక్కడ
ప్రీమియర్స్
సహా
మొదటి
రోజు
టికెట్లు
కూడా
ఎప్పుడో
బుక్
అయిపోయాయి.
దీంతో
రిలీజ్‌కు
ముందే
ఈ
సినిమాకు
హాఫ్
మిలియన్
డాలర్ల
కంటే
ఎక్కువగా
కలెక్షన్లు
వచ్చాయి.
ఉల్లిపొర లాంటి డ్రెస్ మంచు లక్ష్మి షో: ఓ రేంజ్‌లో ఎద అందాలు ఆరబోత

ప్రీమియర్స్‌కే అరాచకంగా
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఓవర్సీస్‌లో భారీ స్పందన దక్కింది. మరీ ముఖ్యంగా అక్కడ ప్రీమియర్స్‌ను నందమూరి అభిమానులు విజయవంతం చేసేశారు. ఈ నేపథ్యంలో యూఎస్ బాక్సాఫీస్ రిపోర్టు ప్రకారం.. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే 708k డాలర్స్ గ్రాస్ వసూలు అయింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 5.75 కోట్లు వచ్చాయి.

బాలయ్య ఆల్ టైం రికార్డు
'వీర సింహా రెడ్డి' మూవీకి యూఎస్‌లో ప్రీమియర్స్ ద్వారానే 708k డాలర్స్ వచ్చాయి. ఇది బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైం రికార్డు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మొదటి రోజు కలెక్షన్స్ ద్వారా ఈ చిత్రం ఒక మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే వేగంగా ఈ మార్కును అందుకుని బాలకృష్ణ మరో రికార్డును ఖాతాలో వేసుకుంటారు.