Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Veera Simha Reddy's Day 8 Collections: మళ్ళీ అదే రేంజ్ లో బాలయ్య కలెక్షన్స్.. మొత్తం ఎంత వచ్చాయంటే?
నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. సంక్రాంతి ఫెస్టివల్ లో ఈ సినిమాకు మాస్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కొంత నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ కూడా సినిమా కలెక్షన్స్ మాత్రం మొదట్లో భారీ స్థాయిలోనే వచ్చాయి. ఒక విధంగా బాలయ్య బాబు కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది. ఇక ఈ సినిమా ఎనిమిది రోజుల్లో ఎంత కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ టార్గెట్..
నందమూరి బాలకృష్ణ తన ప్రతి సినిమాకు కూడా ఇప్పుడు మార్కెట్ను పెంచుకుంటూ వెళుతున్నాడు. చివరగా అఖండ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమాతో విడుదలకు ముందే మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 73 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది. దీంతో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 75 కోట్లకు ఫిక్స్ అయింది.

కలెక్షన్స్ తగ్గకుండా..
మొదట్లోనే సినిమా ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. నరసింహారెడ్డి సినిమా మొదటిరోజు 25 కోట్లు అందుకుంటే రెండవ రోజు 5.25 కోట్లను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఆరవ రోజు వరకు కూడా ఈ సినిమా నాలుగు కోట్లకు తక్కువ కాకుండా కలెక్షన్స్ అందుకుంటూ వెళ్ళింది. ఇక ఏడవ రోజు 3.16 కోట్లు వచ్చాయి.

థియేటర్ ఆక్యుపెన్సి
అలాగే
ఈ
సినిమా
వారం
తర్వాత
థియేటర్స్
ఆక్యుపెన్సిని
పెంచుకోవడం
విశేషం.
ఎక్కువ
స్థాయిలో
హైదరాబాదులోనే
ఈ
సినిమాకు
కలెక్షన్స్
పెరుగుతున్నాయి.
ఇక
నెల్లూరు
గుంటూరు
విశాఖపట్నంలో
కూడా
40%
పైగా
ఆక్యుపెన్సి
నమోదైంది.
గతంలో
ఎప్పుడు
లేనివిధంగా
బాలయ్య
బాబు
వారం
తర్వాత
కూడా
మంచి
కలెక్షన్స్
అందుకుంటూ
ఉండటం
విశేషం.

8వ రోజు కలెక్షన్స్
ఇక ఎనిమిదవ రోజు ఈ సినిమాకు 30% శాతం వరకు కొంత కలెక్షన్స్ తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రజెంట్ ట్రెండును బట్టి చూస్తే ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 2.3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.70 కోట్లు ఓవర్సీస్ లో 5.60 కోట్లు రేంజ్ లో కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలయ్య బాబు ఓవర్సీస్ లో కూడా ఈసారి మంచి నెంబర్స్ అందుకుంటున్నాడు.

ఇప్పటివరకు వచ్చిన మొత్తం కలెక్షన్స్
ఎనిమిదో రోజు ఈ సినిమా మొత్తంగా ఇండియాలో అయితే 3.50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంది. ఎనిమిది రోజుల మొత్తం కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే దాదాపు 116 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 70 కోట్ల రేంజ్ లో ఈ సినిమా నుంచి షేర్ కలెక్షన్ సొంతం చేసుకుంది.

ప్రాఫిట్స్ వచ్చేలా..
ఇక
సినిమా
ఓవరాల్
బిజినెస్
అయితే
ప్రపంచ
వ్యాప్తంగా
73
కోట్ల
వరకు
చేసింది.
అంటే
సినిమా
బాక్స్
ఆఫీస్
వద్ద
74
కోట్లు
అందుకుంటేనే
హిట్
అయినట్లు
లెక్
ఇక
ప్రస్తుతం
అందిన
లెక్కల
సమాచారం
ప్రకారం
ఈ
సినిమా
70
కోట్లకు
పైగా
షేర్
కలెక్షన్స్
అందుకుంది.
అంటే
ఇంకా
బాక్స్
ఆఫీస్
వద్ద
ఈ
సినిమా
కేవలం
మూడు
కోట్ల
రేంజ్
లో
షేర్
కలక్షన్స్
అందుకుంటే
సక్సెస్
అయినట్లు
లెక్క.