twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేక్ ఈవెన్ దాటింది...ఇక లాభాలే

    By Srikanya
    |

    హైదరాబాద్ : వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రై. లిమిటెడ్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొంది విడుదలైన చిత్రం 'దృశ్యం'. ఈ చిత్రం ప్రారంభంలో డల్ గా ఉన్నా ఇప్పుడు కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసే దిసగా ప్రయాణిస్తోంది. ఓపినింగ్స్ పెద్దగా తెచ్చుకోలేక పోయిన ఈ చిత్రం బడ్జెట్, బిజినెస్ పరంగా భాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినట్లే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. బి,సి సెంటర్ల వద్ద కలెక్షన్స్ సాధించలేకపోతున్న ఈ చిత్రం ఎ,మల్టిఫ్లెక్స్ సెంటర్లలలో బాగానే కలెక్టు చేస్తోంది.

    Venkatesh's Drishyam 24th day collections

    ఏరియా ............కోట్లలో

    నైజాం - 7.10

    సీడెడ్ - 2.05

    వైజాగ్ - 2.20

    గుంటూరు - 1.25

    తూర్పు పశ్చిమ గోదావరి - 1.05

    పశ్చి మ గోదావరి - 0.75

    కృష్ణా - 1.05

    నెల్లూరు - 55 లక్షలు

    24 రోజులు, ఎపి, నైజాం కలెక్షన్స్ షేర్ 16 కోట్లు

    కర్ణాటక - 1.55 కోట్లు

    మిగిలిన ఏరియా - 0.25 కోట్లు

    ఓవర్ సీస్ - 1.50 కోట్లు

    ముఖ్యంగా వీకెండ్స్ లో ఈ చిత్రం ఫ్యామిలీలను ఎట్రాక్ట్ చేస్తోంది. శాటిలైట్ రైట్స్ తో కలిపి చూస్తే పూర్తి సేఫ్ అని, లాభాల్లో ఉన్నట్లే తేల్చారు. ఒరిజనల్ చూసిన వారికి ఈ చిత్రం పెద్దగా ఆనకపోయినా, తెలుగులో మాత్రమే చూసేవారికి చిత్రం ఆకట్టుకుంటోంది

    ఇక దర్శకురాలు శ్రీప్రియ తన దర్శకత్వ ప్రతిభ ని కేవలం అక్కడ సీన్స్ ని ఇక్కడ అనువదించటానికి మాత్రమే ఉపయోగించని విమర్శలు వినపడ్డాయి. అయితే వెంకటేష్ మాత్రం భావోద్వేగ సన్నివేశాల్లో చాలా బాగా చేయడంతో, అతనికో ల్యాండ్ మార్క్ సినిమాగా మారిందని అంటున్నారు.

    మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ హిట్ సినిమా 'దృశ్యం'కు రీమేక్ ఇది. డా.డి.రామానాయుడు సమర్పించారు. వెంకటేష్ తొలిసారి ఇద్దరు పిల్లల తండ్రిగా, మధ్య వయస్కుడిగా నటించారు. మీనా కీలక పాత్రధారి. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. అరకు, విజయనగరం, వైజాగ్, హైదరాబాద్, కేరళలో షూటింగ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేసారు.

    నరేష్, నదియ, రవి కాలే, పరుచూరి వెంకటేశ్వరరావు, సమీర్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సమర్పణ: డా.డి.రామానాయుడు, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: శరత్, కథ: జీతూ జోసెఫ్, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: స్వామి, ఆర్ట్: వివేక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సురేష్ బాలాజి, జార్జ్ పైయస్.

    English summary
    
 Venkatesh’s Drishyam is a remake of Malayalam block buster film Drishyam. Let’s take a look at the Box Office collections of the movie .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X