»   » ఇలా అనేసావేంటి ‘గురు’: ఊరకుక్క దృష్టంతా ఎప్పుడూ పెంట మీదే... వెంకీ నోట ఈ మాట

ఇలా అనేసావేంటి ‘గురు’: ఊరకుక్క దృష్టంతా ఎప్పుడూ పెంట మీదే... వెంకీ నోట ఈ మాట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'ఊర కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని దృష్టంతా ఎప్పుడూ పెంట మీదనే ఉంటుంది' వంటి ఏ స్టార్ చెప్పటానికి ఇష్టపడిని డైలాగులతో వెంకటేష్ ..గురు ట్రైలర్ వచ్చేసింది.

సీనియ‌ర్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో నటించిన చిత్రం గురు అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. సాలాఖ‌ద్దూస్ పేరుతో బాలీవుడ్‌లో ఘన విజయం సాదించిన ఈ చిత్రాన్ని గురు అనే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేశారు. వెంకీ బాక్సింగ్ కోచ్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో రితిక సింగ్ శిష్యురాలి పాత్ర‌లో న‌టిస్తుంది. సినిమా టీజ‌ర్ రీసెంట్‌గా విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది.

ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సినిమాపై బజ్ క్రియేట్ చేయటానికి, అంచ‌నాలు పెంచ‌డానికి ఈ సినిమా ట్రైల‌ర్‌ను ని విడుదల చేసారు. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు సినీ ప్రియులను ఎంతగానో అలరిస్తోంది. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఒక బాక్సింగ్‌ కోచ్‌గా వెంకటేష్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. చాలా సీరియస్‌ కోచ్‌గా, అమ్మాయిలను కూడా చాలా రఫ్‌గా హ్యాండిల్‌ చేసే వ్యక్తిగా వెంకీ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అని ఈ ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది.

Venkatesh's Guru set for 7th April release

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'గురు' ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సినిమాలో వెంకటేష్‌ బాక్సింగ్‌ కోచ్‌గా నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణ స్వరాలు సమకూర్చారు. ఎన్నో విభిన్న పాత్రలతో మెప్పించిన వెంకటేష్‌ 'గురు' కోసం తొలిసారి పాట పాడటం విశేషం. రితికా సింగ్‌ మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రియల్ 7న విడుదల చేయనున్నారు.

నిజానికి గురు సినిమా ఎప్పుడో రెడీ అయిపోయింది. సంక్రాంతి వెళ్లిన వెంటనే విడుదల నిర్మాతలు ప్లాన్ చేసారు. కానీ సరైన స్లాట్ దొరకక అలా వెయిట్ చేస్తూ వచ్చారు. చివరకి ఇప్పుడు డేట్ ఫైనల్ చేసుకున్నారు. మార్చి 24న కాటమరాయుడు విడుదల అవుతుంది. ఏప్రియల్ చివర్లో లో బాహుబలి 2 విడుదల అవుతుంది. ఈ రెండింటికి మధ్యగా గురు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు.

బాలీవుడ్ కు వచ్చి సూపర్ హిట్ అయిన మాధవన్ 'సాలా ఖడూస్' సినిమాను వెంకీ సీరియస్ గా రీమేక్ చేస్తున్నారు. ఈ 'గురు' సినిమా కోసం కేవలం వెంకీ-రితికా సింగ్ ల కాంబినేషన్ లో వచ్చే సీన్స్ మరియు వెంకీ కనిపించే సీన్స్ మాత్రమే షూట్ చేసారట. మిగతా సీన్స్ అన్నీ ఒరిజినల్ నుంచే తీసుకున్నారని తెలుస్తోంది. అంటే కాపీ పేస్ట్ లాంటి పనే అన్నమాట. దీంతో దాదాపు ఇద్దరు నటులతోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసేసారని చెప్పుకుంటున్నారు.

నిర్మాత శశికాంత్‌ మాట్లాడుతూ.. 'సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నంతో పని చేసి, 'మిత్ర్‌' సినిమాతో నేషనల్‌ అవార్డు దక్కించుకున్న సుధా కొంగర ఈ చిత్రాన్ని మలచిన తీరు అద్భుతం. వెంకటేశ్‌ ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త లుక్‌లో కనిపిస్తారు. ఎమోషన్స్‌తో సాగే ఒక స్పోర్ట్స్‌ డ్రామా ఇది. ఈ వేసవిలో విడుదల చేస్తున్నాం. ' అని శశికాంత్‌ తెలిపారు.

రితికాసింగ్‌, ముంతాజ్‌ సర్కార్‌ కీలక పాత్రలు పోషించారీ చిత్రంలో. రితికాసింగ్‌ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్‌ పొందారు. అలాగే ముంతాజ్‌ మరెవరో కాదు ...ప్రసిద్ధ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్‌ కుమార్తె. నాజర్‌, తనికెళ్ల భరణి, రఘుబాబు, జాకీర్‌ హుస్సేన్ ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, శ్రీమణి, సంగీతం: సంతోష్ నారాయణ్‌, ఛాయాగ్రహణం: కె.ఎ.శక్తివేల్‌, సహనిర్మాత: చక్రవర్తి రామచంద్ర, నిర్మాత: ఎస్‌.శశికాంత, దర్శకత్వం: సుధ కొంగర.

English summary
Victory Venkatesh's upcoming sports drama 'Guru' is now in news for its new release date. The theatrical trailer of the movie released via social media, followed by an early April release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu