twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ కు కొంచెం కూడా క్రేజ్ తగ్గలేదని, ఈ విషయం ప్రూవ్ చేస్తోంది

    వెంకటేష్ తాజా చిత్రం గురు కు శాటిలైట్ బిజినెస్ పూర్తైంది.

    By Srikanya
    |

    హైదరాబాద్‌: విక్టరీ వెంకటేశ్‌ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'గురు' చిత్రాన్ని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ ఏడాది సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తమ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫుల్ గా ఎంటర్ టైన్ చేశారు. చాలా కాలం తర్వాత ఇలా సీనియర్ హీరోలు నలుగురు సినిమాలు చేయడం, వారి సినిమాలు హిట్ కావడం జరిగాయి. అయితే వెంకటేష్ నటించిన గురు సినిమా ఇంకా విడుదల కాకపోగా చిత్ర రిలీజ్ డేట్ విషయంలోను ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు . అయితే ఇప్పుడు వెంకీ అభిమానులను ఓ వార్త మాత్రం ఆనందపరుస్తోంది.

    అదేమిటంటే...ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని రీసెంట్ గానే క్లోజ్ చేసారు. అందుతున్న సమాచారం ప్రకారం..జెమినీ ఛానెల్ వారు ఆరున్నర కోట్లకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది పెద్దగా ఫామ్ లో లేని వెంకటేష్ సినిమాకు పెద్ద ఎమౌంటే అని చెప్పాలి. దాంతో వెంకటేష్ కు మార్కెట్ లో క్రేజ్ తగ్గలేదని, బిజినెస్ కూడా అదే స్దాయిలో జరుగుతుందని అంచనా లు ట్రేడ్ లో జరుగుతున్నాయి.

    నిర్మాత శశికాంత్‌ మాట్లాడుతూ.. 'సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నంతో పని చేసి, 'మిత్ర్‌' సినిమాతో నేషనల్‌ అవార్డు దక్కించుకున్న సుధా కొంగర ఈ చిత్రాన్ని మలచిన తీరు అద్భుతం. వెంకటేశ్‌ ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త లుక్‌లో కనిపిస్తారు. ఎమోషన్స్‌తో సాగే ఒక స్పోర్ట్స్‌ డ్రామా ఇది. ఈ వేసవిలో విడుదల చేస్తున్నాం. విడుదల తేదీ త్వరలోనే తెలుపుతాం' అని శశికాంత్‌ తెలిపారు.

    ఈ చిత్రంలోని 'ఏయ్‌ సక్కనోడా' అనే పాట లిరికల్‌ వీడియోను ఈ నెల 17న విడుదల చేస్తున్నారు.రితికా సింగ్‌, ముంతాజ్‌ సర్కార్‌లు ఈ చిత్రంలో వెంకటేశ్‌తో పాటు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. 'గురు' చిత్రం ఆడియోను మార్చి మొదటి వారంలో విడుదల చేస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

    సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కథానాయికగా మాతృకలో నటించిన రితికా సింగే నటించింది. గురు మూవీలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా కనిపించనుండగా, ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. జనవరిలో చిత్రం విడుదలవుతుందని భావించినప్పటికి నిన్నటి వరకు ఈ సినిమా జాడే లేకుండా పోయింది.

    రితికాసింగ్‌, ముంతాజ్‌ సర్కార్‌ కీలక పాత్రలు పోషించారీ చిత్రంలో. రితికాసింగ్‌ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్‌ పొందారు. అలాగే ముంతాజ్‌ మరెవరో కాదు ...ప్రసిద్ధ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్‌ కుమార్తె. నాజర్‌, తనికెళ్ల భరణి, రఘుబాబు, జాకీర్‌ హుస్సేన్ ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, శ్రీమణి, సంగీతం: సంతోష్ నారాయణ్‌, ఛాయాగ్రహణం: కె.ఎ.శక్తివేల్‌, సహనిర్మాత: చక్రవర్తి రామచంద్ర, నిర్మాత: ఎస్‌.శశికాంత, దర్శకత్వం: సుధ కొంగర.

    English summary
    Venkatesh’s upcoming sports drama, Guru’s satellite rights have been acquired by popular entertainment channel Gemini TV for a handsome Rs.6.50 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X