»   » ఈసారైనా ఆగకుండా రిలీజ్ అవుతుందా

ఈసారైనా ఆగకుండా రిలీజ్ అవుతుందా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అజ్మల్, నిఖితా నారయణ్ జంటగా తెరకెక్కించిన వెన్నల్లో హాయి హాయి సినిమా. చాలా కాలంగా విడుదల కాకుండా ఉండిపోయిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల అవుతోంది. పిభ్రవరి 5న ఈ చిత్రం విడుదల చేయటానికి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

ఇక ఈ సినిమా ఎప్పుడో పూర్తైనా ఇంతవరకు రిలీజ్ కు మాత్రం నోచు కోలేదు. దాంతో సినిమా లేట్ అవుతున్నా కొద్ది దాని టైటిల్స్ మారుస్తూ వస్తున్నాడు డైరక్టర్ వంశీ. మొదట....తను మొన్నే వెళ్లిపోయింది అని ఆ తర్వాత...మెల్లగా తట్టింది మనసు తలుపు అని పెట్టాడు.

Vennello Hai Hai Movie Release Date Announced

కాని అప్పటికి రిలీజ్ కాకపోవటంతో ఆ టైటిల్ ని కూడా చేంజ్ చేశాడు డైరక్టర్ వంశీ. గతంలో వంశీ డైరెక్ట్ చేసిన ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు సినిమాలో ఓ పాట పల్లవిని తీసుకుని తన సినిమా టైటిల్ గా పెట్టాడు వంశీ.

చిత్రం కాన్సెప్టు ఏమిటంటే... ఎదుటివారికి సాయపడటంలోనే తన ఆనందాన్ని వెదుక్కొనే యువకుడు సుశీల్‌. చదువులు పూర్తి చేసుకొన్నాడు. అందుకే ఇంట్లోవాళ్లు ఓ పెళ్లి సంబంధం చూశారు. సిగ్గులు ఒలకబోస్తూ పెళ్లింట్లో అందంగా ముస్తాబై కూర్చుంది సత్య. కాబోయే దంపతులు ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొన్నారు. మనసు విప్పి మాట్లాడుకొన్నారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి ఓ అమ్మాయిని వెదికేందుకు ప్రయాణం కట్టారు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఈ జంటకీ, ఆ అమ్మాయికీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

Vennello Hai Hai Movie Release Date Announced

దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. ''ఆహ్లాదభరితమైన ప్రేమ కథ. ఓ యువతి కోసం సుశీల్‌, సత్య సాగించే అన్వేషణ విధానం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది''అన్నారు. అజ్మల్ గతంలో "రంగం","రచ్చ" వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు.

తెలుగులో హీరోగా అజ్మల్ కి ఇదే మొదటి చిత్రం. ఈ చిత్రం ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. పూర్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి కెమెరా: ఎమ్వీ రఘు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: వేమూరి సత్యనారాయణ, ఎడిటింగ్: బస్వాపైడిరెడ్డి, సంగీతం: చక్రి.

English summary
Finally, the ‘Vennello Hai Hai’ movie is ready to release on 5th feb. 2016. The other highlight is the film ‘Vennello Hai Hai’ is 25th film for the director Vamsy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu