»   » బిచ్చగాడు 'విజయ్ ఆంటోని' కి సైతం నోట్ల రద్దు సమస్య, తల పట్టుకున్నాడు

బిచ్చగాడు 'విజయ్ ఆంటోని' కి సైతం నోట్ల రద్దు సమస్య, తల పట్టుకున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేయడం ... సినిమా పరిశ్రమపై చాలా ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రిలీజ్ కావాల్సిన సినిమాలకు చాలా ఇబ్బంది ఎదురైంది. ఏరియావైజ్ సినిమా ని రిలీజ్ చేయటానికి...డిస్ట్రిబ్యూటర్స్ ఇవ్వాల్సిన పూర్తి డబ్బుని ఈ బ్లాక్ దెబ్బతో ఇవ్వటానికి సిద్దంగా కనపడటం లేదు. దానికి తోడు ధియోటర్స్ కు జనం రావటంలేదు. దాంతో చాలా ధియోటర్స్ లో షోలు కాన్సిల్ చేసారు.

మొన్న శుక్ర వారం తెలుగులో రిలీజ్ కావాల్సిన అల్లరి నరేష్ చిత్రం సైతం ఈ సమస్యతో రిలీజ్ ఆగిపోయింది.సాహసం చేసి రిలీజ్ చేసిన సాహసం శ్వాశగా సాగిపోకు కలెక్షన్స్ లేక కంగారు పుట్టిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ నెల 18న రిలీజ్ పెట్టుకున్న బిచ్చగాడు చిత్రం సైతం రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రమోషన్ అంతా పూర్తై రిలీజ్ కు దగ్గరవుతున్న సమయంలో డిస్ట్రిబ్యూటర్స్...ఇప్పుడు రిలీజ్ చేస్తే రూపాయి రాదని, ధియోటర్స్ కు జనం రావటం లేదని విజయ్ ఆంటోనికి చెప్తున్నట్లు సమాచారం. దాంతో విజయ్ ఆంటోని ఏం చేయాలా అనే డైలమోలో పడుతున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి.


Vijay Anthony's 'Bethaludu' Falls Victim of Black Money!!

విజియ్ ఆంటోని హీరోగా మల్కాపురం శివ‌కుమార్‌, ఫాతిమా విజ‌య్ ఆంటోని స‌మ‌ర్ప‌ణ‌లో మానస్ రిషి ఎంట‌ర్‌ప్రైజెస్‌, విన్ విన్ విన్ క్రియేష‌న్స్‌, ఆరా సినిమాస్ బ్యాన‌ర్స్‌పై ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.రోహిత్‌, ఎస్‌.వేణుగోపాల్ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం భేతాళుడు. విజయ్ ఆంటోని హీరోగానే కాకుండా ఈ సినిమాకు సంగీతం అందించాడు.


విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ - నేను చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో భేతాళుడు సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. తెలుగు ప్రేక్ష‌కుల నుండి ఇంత పెద్ద ఆద‌ర‌ణ‌ను ఎదురుచూడ‌లేదు. సాధార‌ణంగా నాకు ఇంత మంచి గుర్తింపు, ఆద‌ర‌ణ ఏ ఇర‌వై ఐద‌వ సినిమాకు వ‌స్తుంద‌ని అనుకున్నాను. అయితే నా మూడో సినిమాకే ఇంత మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. భేతాళుడు క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.


చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - టీజ‌ర్‌, ప‌ది నిమిషాల సినిమా వండ‌ర్‌ఫుల్‌గా ఉంది. విజ‌య్ మంచి టాలెంటెడ్ వ్య‌క్తి. స్వ‌గృహ ఫుడ్స్ కుటుంబం అంతా క‌లిసి ఎలాగైతే మంచి వంట‌కాలు చేస్తారో, విజ‌య్ ఆంటోని, ఫాతిమా స‌హా వారి కుటుంబం అంతా మంచి కంటెంట్ ఉన్న సినిమాల‌ను చేయాల‌ని ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తుంటారు. బిచ్చ‌గాడు స‌క్సెస్‌తో విజ‌య్ ఆంటోని తెలుగులో ఒక స్టెప్ ఎదిగారు. భేతాళుడు స‌క్సెస్‌తో మ‌రో మెట్టు ఎక్క‌డం గ్యారంటీ. నిర్మాత‌లు మంచి ఫ్యాష‌న్ ఉన్న‌వ్య‌క్త‌లు ఇలాంటి వ్య‌క్త‌లు ఇండ‌స్ట్రీకి అవ‌స‌రం. బిచ్చ‌గాడు కంటే భేతాళుడు పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.,


బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - సినిమా టీజ‌ర్‌, ప‌ది నిమిషాల సినిమా వండ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. సినిమాను ఎప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అందుకే నేను కృష్ణా, వైజాగ్‌, ప‌శ్చిమ‌గోదావ‌రి, తూర్పు గోదావ‌రి ప్రాంతాల హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాను. అలాగే విజ‌య్ ఆంటోని చేసిన యెమెన్ సినిమాను మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డితో క‌లిసి కొన్నాను. సూర్య, విక్ర‌మ్ తెలుగులో ఎలా స‌క్సెస్ అయ్యారో విజ‌య్ ఆంటోని కూడా అలానే పెద్ద స‌క్సెస్‌ఫుల్ హీరో కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ రామ‌కృష్ణ మాట్లాడుతూ - ద‌ర్శ‌కుడిగా నా తొలి చిత్రం భేతాళుడు. ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్. ఇంత మంచి సినిమాను చేసే అవ‌కాశం ఇచ్చిన విజ‌య్ ఆంటోని, ఫాతిమా ఆంటోనిగారికి థాంక్స్‌. మంచి టీం స‌పోర్ట్‌తో మంచి సినిమాను చేశాను. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.


మరో ప్రక్కన నోట్ల రద్దు గురించిన వార్త రాగానే అందరూ బిచ్చగాడు సినిమాలో ఓ సీన్ గురించి విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. ఆ సీన్ ఏమిటంటే...సినిమాలో 'అవినీతి నిర్మూలన' గురించి ఓ ఎఫ్‌ఎం స్టేషన్‌లో చర్చ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఓ బిచ్చగాడు ఫోన్‌ చేసి అవినీతిని నిర్మూలించాలంటే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలని సూచిస్తాడు. తన వాదనను ఉదాహరణలతో సహా వివరిస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

English summary
Following the announcement of Prime Minister Narendra Modi to ban the higher denomination currency in order to flush out the black money from the system seems to have forced Anthony to postpone the release date of his upcoming psychological thriller 'Bethaludu'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu