»   » నోటా తొలి రోజు కలెక్షన్లు.. నెగిటివ్ టాక్‌తో.. ఎన్ని కోట్లు వస్తే హిట్ అంటే..

నోటా తొలి రోజు కలెక్షన్లు.. నెగిటివ్ టాక్‌తో.. ఎన్ని కోట్లు వస్తే హిట్ అంటే..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  NOTA Movie First Day Collections | Vijay Devarakonda | Mehreen Pirzada | Filmibeat Telugu

  విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రంపై సమీక్షలు ప్రతీకూలంగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు మంచి కలెక్షన్లను సాధించింది. భారీ అంచనాల నెలకొని ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భారీగా వసూళ్లను రాబట్టింది. అయితే తొలి ఆట నుంచే నెగిటివ్ రివ్యూలు పడటంతో వీకెండ్‌లో కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం నోటా కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

  యూఎస్ బాక్సాఫీస్ వద్ద

  యూఎస్ బాక్సాఫీస్ వద్ద

  నోటా చిత్రం అమెరికాలో సుమారు 54 వేల అమెరికా డాలర్లను వసూలు చేసింది. ఈ చిత్రం దాదాపు 114 లోకేషన్లలో విడుదలైంది. వారాంతంలో ఈ కలెక్షన్లు పెరిగితే 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడానికి అవకాశం ఉంటుంది.

  ఆంధ్రాలో వసూళ్లు

  ఆంధ్రాలో వసూళ్లు

  ఆంధ్రాలో నోటా చిత్రం తొలి రోజు భారీ కలెక్షన్లు రాబట్టింది. నెల్లూరులో తొలి రోజు రూ.20 లక్షల షేర్ వసూలు చేసింది. కృష్ణా జిల్లాలో ఈ చిత్రం 30 లక్షల షేర్‌ను రాబట్టడం విశేషం. పూర్తి స్థాయి కలెక్షన్ల వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

  12వ స్థానంలో నోటా

  12వ స్థానంలో నోటా

  అమెరికా బాక్సాఫీస్ వద్ద నోటా చిత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. ప్రీమియర్ల గణాంకాలు చూస్తే ఈ చిత్రం 12వ స్థానంలో నిలిచింది. అయితే వారాంతం కలెక్షన్లు మెరుగుపడితే ఈ చిత్రం గౌరవప్రదమైన స్ఠానంలో నిలచే అవకాశం ఉంది.

  నోటా హిట్ కావాలంటే

  నోటా హిట్ కావాలంటే

  నోటా థియేట్రికల్ హక్కులను సుమారు రూ.20 కోట్లకు అమ్మడం జరిగింది. ఓవర్సీస్ రైట్స్‌ రూ.3.5 కోట్లు పలికాయి. ఒకవేళ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకోవాలంటే కనీసం రూ.38 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంటుంది. హిట్ టాక్‌తో సరిపెట్టుకోవాలంటే ఈ చిత్రం రూ.25 నుంచి 29 కోట్ల మధ్య వసూలు చేయాల్సి ఉంటుంది.

  English summary
  NOTA is an political thriller film directed by Anand Shankar, made in Tamil and Telugu languages. It stars Vijay Deverakonda, making his debut in Tamil cinema and Mehreen Pirzada, in the lead roles. Produced by Studio Green, this film will have Sam C. S. as the music director while Ravi K. Chandran's son, Santhana Krishnan Ravichandran handles the cinematography. The film is planned to be released on 5 October 2018. USA premieres on October 4th 2018.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more