Pushpaka Vimanam Weekend collections.. యూఎస్, ఆస్ట్రేలియాలో దుమ్మురేపుతున్న పుష్పక విమానం

ఆనంద్ దేవరకొండ, శాన్వీ మేఘన, గీత్ సైనీ జంటగా, గోవర్దన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలుగా దామోదర దర్శకత్వంలో వచ్చిన పుష్పకవిమానం చిత్రం రిలీజ్ తర్వాత మంచి టాక్ సంపాదించుకొన్నది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకొన్న సస్పెన్స్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకొన్నది. అయితే తొలి వారాంతంలో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఈ వసూళ్ల వివరాల్లోకి వెళితే..

పుష్ప విమానం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారు రూ.2 కోట్ల మేర ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేసింది. అయితే ఈ సినిమా కనీసం 2.5 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్‌ను సొంతం చేసుకొనే పరిస్థితుల్లో బాక్సాఫీస్ పరుగును మొదలుపెట్టింది. అయితే తొలి రోజు రూ.55 లక్షలు నికరంగా, 1 కోటి రూపాయలు గ్రాస్‌ను నమోదు చేసింది. రెండో రోజు 35 లక్షలు నికరంగా, మూడో రోజు 38 లక్షల నికర వసూళ్లను నమోదు చేసింది. దాంతో మూడు రోజుల్లో కోటికిపైగా షేర్‌ను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నైజాంలో 30 లక్షల మేర, ఆంధ్రాలో 50 లక్షలు, కర్టాటక, రెస్టాఫ్ ఇండియాలో 6 లక్షలకుపైగా వసూళ్లను నమోదు చేసింది.

Vijay Deverakondas Pushpaka Vimanam collections worldwide

ఇక ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. పుష్పక విమానం అమెరికా, ఆస్ట్రేలియాలో భారీ వసూళ్లను రాబడుతున్నది. అమెరికాలో శనివారం కవరకు 70 వేల అమెరికన్ డాలర్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వారాంతం తర్వాత ఈ సినిమా లక్ష యూఎస్ డాలర్లు వసూలు చేస్తుందనే అంచనా వేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో పుష్పక విమానం వారాంతం వరకు రూ.16512 ఆస్ట్రేలియా డాలర్లు వసూలు చేసింది. ఇంకా ఈ సినిమాకు ఓవర్సీస్‌లో మంచి స్పందన వ్యక్తమవుతుందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు రిపోర్ట్.

ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో థియేటర్ల సంఖ్యను పెంచుతున్నట్టు తెలుస్తున్నది. సింగిల్, మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరిగిందనే వార్తలు ఈ సినిమాకు సానుకూలంగా మారింది. దీంతో మరింతగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X