విజయ్ ‘పోలీసోడు’టీజర్‌ (వీడియో), పవన్ ని కాపీ కొట్టినా

By Srikanya

హైదరాబాద్‌: హీరో విజయ్‌ హీరోగా నటించిన చిత్రం 'పోలీసోడు'. ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసినట్లు నిర్మాత దిల్‌రాజు సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ... వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, అమీ జాక్సన్‌లు హీరోయిన్స్ గా నటించారు. జి.వి. ప్రకాశ్‌కుమార్‌ చిత్రానికి సంగీతం సమకూర్చారు. 'తెరి' అనే టైటిల్‌తో తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'పోలీసోడు'గా విడుదల చేస్తున్నారు. త్వరలో 'పోలీసోడు' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

నిర్మాతలు మాట్లాడుతూ ''తుపాకి'తో విజయ్‌, 'రాజా రాణి'తో అట్లి ఆకట్టుకొన్నారు. వీరి కలయికలో వస్తున్న ఈ చిత్రం గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. పోలీసు చిత్రాల్లో విభిన్నంగా నిలుస్తుంది. ఈనెలలోనే పాటల్ని, సినిమానీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

విజయ్ , సమంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలయిపులి ఎస్ థాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X