Don't Miss!
- Finance
notice peiod: నోటీసు పీరియడ్ కు 'NO' చెప్తే.. ఊ అంటారా.. ఉఊ అంటారా ?
- News
Vastu tips: ఇంట్లో మహిళలకు ఎప్పుడూ రోగాలా? ఈ వాస్తు దోషాలతోనే కావచ్చు!!
- Lifestyle
Today Rasi Palalu 24 January 2023: ఈ రోజు మిథున రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక పరిస్థి గొప్ప మెరుగుదల
- Sports
సూర్యకుమార్ యాదవ్.. నా బెస్ట్ ఫ్రెండ్.. అతను నాలాగే ఇబ్బంది పడ్డాడు: సర్ఫరాజ్ ఖాన్
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Varasudu Day 1 Collections: ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు.. దానికంటే సగమే.. దిల్ రాజు ఏరియాలో మాత్రం!
కోలీవుడ్ స్టార్ హీరోనే అయినా దక్షిణాది మొత్తం మార్కెట్‌ను ఏర్పరచుకుని బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్నాడు ఇళయదళపతి విజయ్. విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో భారీ విజయం కోసం వేచి చూస్తోన్నాడు. ఈ క్రమంలోనే తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో 'వారసుడు' అనే సినిమాను చేశాడు. ఈ తమిళ వెర్షన్ 11వ తేదీనే విడుదలైన ఈ మూవీ తెలుగులో 14న వచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ నటించిన 'వారసుడు' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఎలా వచ్చాయో లుక్కేద్దాం పదండి మరి!

వారసుడుగా ఎంటరైన విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రమే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.
యాంకర్ విష్ణుప్రియ ఎద అందాల జాతర: బీచ్‌లో తడిచిన శరీరంతో ఘాటుగా!

విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్
విజయ్ మార్కెట్‌కు తోడు 'వారసుడు' మూవీపై నెలకొన్న అంచనాల ప్రకారం.. ఈ చిత్రం నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలు కలిపి రూ. 7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 14.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.

అలాంటి టాక్... వసూళ్లు ఇలా
ఎన్నో అంచనాల నడుమ రూపొందిన 'వారసుడు' మూవీ జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ తమిళ వెర్షన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. తెలుగులోనూ అదే రిపీట్ అయింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన కలెక్షన్లు వచ్చే అవకాశం లేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు.
నగ్నంగా ఆదా శర్మ అరాచకం: వీటిలో మీ ఫేవరెట్ ఏది అంటూ పచ్చిగా!

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'వారసుడు'కు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే అనుకున్న రేంజ్‌లో స్పందన దక్కలేదు. ఫలితంగా నైజాంలో రూ. 1.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 45 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 40 లక్షలు, ఈస్ట్‌లో రూ. 18 లక్షలు, వెస్ట్‌లో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 18 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి రూ. 3.10 కోట్లు షేర్, రూ. 5.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

హిట్ అవ్వాలంటే ఎంత రావాలి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'వారసుడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 14.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15.00 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 3.10 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 11.93 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.
ఘాటు ఫొటోతో టెంప్ట్ చేస్తోన్న దీప్తి సునైనా: కింది నుంచి చూపిస్తూ హాట్‌గా!

ఆ మూవీలో సగం మాత్రమే
దిల్ రాజు నిర్మాణంలో విజయ్ నటించిన 'వారసుడు' మూవీకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.10 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. దీంతో ఇది ఈ కోలీవుడ్ హీరో కెరీర్‌లో మూడో బెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. విజయ్ నటించిన 'మాస్టర్' ఏకంగా రూ. 6.01 కోట్లు వసూలు చేసింది. అలాగే, 'బీస్ట్' రూ. 4.81 కోట్లు రాబట్టింది. వీటి కంటే వారసుడికి తక్కువ వచ్చాయి.