Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Varisu 1st Day Collections: మొదటిరోజు అసలు లెక్క ఇదే.. విజయ్ బాక్సాఫీస్ సౌండ్ అదిరింది!
దిల్ రాజు ప్రొడక్షన్లో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారిసు సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి రూపొందిన విషయం తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ముందు తమిళంలో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక జనవరి 14న తెలుగులో విడుదల కానుంది. అయితే ఈ సినిమా బుధవారం రోజు తమిళంలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాగా మొత్తంగా మొదటి రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక అఫీషియల్ లెక్కల ప్రకారం మొదటి రోజువ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే..

భారీగా అడ్వాన్స్ బుకింగ్స్
తమిళ ఇండస్ట్రీలో మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న విజయ్ ఈసారి ఒక డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వారిసు సినిమాకు మొదటి నుంచి కూడా తమిళంలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్ జయసుధ శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక మొదటిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రికార్డులను క్రియేట్ చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక వారిసు సినిమా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతవరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తమిళనాడులో రూ.72 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.14 కోట్లు, కర్ణాటకలో రూ.7.20 కోట్లు కేరళలో రూ.6.50 కోట్లు ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.20 కోట్లు ఓవర్సీస్ లో 35 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 137.90 కోట్ల వరకు విజయ్ సినిమా బిజినెస్ అయితే చేసింది.

మొదటి రోజు కలెక్షన్స్
ఇక వారిసు సినిమాకు మొదటి రోజు అందిన గ్రాస్ కలెక్షన్స్ రాష్ట్రాల వారిగా ఈ విధంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఈ సినిమాను విడుదల చేయలేదు. ఇక తమిళనాడులో అయితే రూ. 20.15 కోట్లు అందుకోగా కర్ణాటకలో రూ.5.62 కోట్లు కేరళలో రూ.4.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

మిగతా ఏరియాలలో..
ఈసారి విజయ్ పెద్దగా మార్కెట్ లేని ఏరియాలలో కూడా మంచి ఓపెనింగ్స్ అయితే అందుకున్నాడు. మొత్తంగా రెస్టాఫ్ ఇండియాలో చూసుకుంటే మాత్రం రూ.1.15 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా విజయ్ కు మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఇక అక్కడ ప్రీమియర్స్ తో కలుపుకొని మొత్తంగా 14.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్
విజయ్ సినిమా అయితే టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈసారి సాంగ్స్ తో పాటు విజయ్ లుక్కు కూడా ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ సినిమా విడుదల తరువాత మాత్రం టాక్ అంత పాజిటివ్ గా లేదు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.46.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అలాగే రూ.23.60 కోట్ల షేర్ సొంతం చేసుకుంది.

ఇంకా ఎంత రావాలంటే?
ఇక సినిమా అయితే మొత్తంగా రూ.137.90 కోట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ చేసింది. అంటే రూ.139 కోట్ల కలెక్షన్స్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. ఇక మొదటి రోజు అయితే ప్రపంచ వ్యాప్తంగా రూ.23.60 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే సినిమా సక్సెస్ కావాలి అంటే ఇంకా రూ.115.40 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి ఆ కలెక్షన్స్ ను సినిమా ఎన్ని రోజుల్లో రికవరీ చేస్తుందో చూడాలి.