twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chakra 6 days collections: 35కోట్ల బడ్జెట్ .. సగం కూడా వెనక్కి తీసుకురాలేకపోతున్న విశాల్!

    |

    భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సెట్ చేసుకున్న తెలుగు నటుడు విశాల్. తండ్రి తమిళ్ లో నిర్మాత కావడం వలన మొదటి నుంచి అక్కడి ఇండస్ట్రీలోనే ఎక్కువగా వర్క్ చేసి సొంతంగా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే విశాల్ ఎలాంటి తమిళ్ సినిమా చేసినా కూడా అవి తెలుగులో విడుదల అవుతుంటాయి. ఇక భారీ బడ్జెట్ తో వచ్చిన చక్ర సినిమా అనుకున్నంత రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకోలేదు. ఇక 6 రోజుల్లో సినిమాకు వచ్చిన కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

    మిక్సీడ్ టాక్ తో..

    మిక్సీడ్ టాక్ తో..

    విశాల్ సామాజిక అంశాలపై ఈ మధ్య ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఈ శుక్రవారం చక్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మిక్సీడ్ టాక్ తో వెళుతోంది. MS ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, రెజీనా కసాండ్రా హీరోయిన్స్ గా నటించారు. విశాల్ హోమ్ ప్రొడక్షన్ లోనే సినిమాను నిర్మించారు.

    35కోట్ల బడ్జెట్ తో..

    35కోట్ల బడ్జెట్ తో..

    యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా కోసం విశాల్ ప్రమోషన్ బాగానే చేశాడు. తెలుగులో కూడా స్పెషల్ గా చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి మిడియా ద్వారా సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశారు. ఈ సినిమా కథపై నమ్మకంతో సినిమాకు 35కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు.

    6రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

    6రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

    అయితే సినిమా మాత్రం అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. తెలుగు తమిళ్ లో విశాల్ దాదాపు ఒకే రకమైన మార్కెట్ తో కొనసాగుతున్నాడు అనేది మరోసారి ఋజువయ్యింది. చక్ర సినిమాకు మొత్తం 6 రోజుల్లో తమిళ్ లో కనీసం 8కోట్ల గ్రాస్ కూడా దాటలేదని టాక్ వస్తోంది. ఇక తెలుగులో 6కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

    తమిళ్, తెలుగులో.. ఒకే స్థాయిలో..

    తమిళ్, తెలుగులో.. ఒకే స్థాయిలో..

    ఇక ఓవర్సీస్ లో 60లక్షల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. మొత్తంగా ఆరు రోజుల్లో విశాల్ చక్ర వరల్డ్ వైడ్ గా 13.3కోట్ల గ్రాస్ ని మాత్రమే సొంతం చేసుకుందట. గ్రాస్ ఇంత ఉంటే షేర్ 7కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. విశాల్ తమిళ్ లో ఎలాంటి కలెక్షన్స్ అందుకున్నాడో దాదాపు తెలుగులో కూడా అదే తరహాలో కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

    ఇలానే కొనసాగితే..

    ఇలానే కొనసాగితే..

    విశాల్ చక్ర సినిమా బడ్జెట్ 35కోట్లు. కానీ ఇప్పుడు కలెక్షన్స్ చూస్తే సగం షేర్స్ కూడా రాబట్టలేదు. ఇలానే కొనసాగితే సినిమాకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గతంలో విశాల్ సినిమాలు సెకండ్ వీక్ కూడా పుంజుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పట్లో ఆ విధంగా కలెక్షన్స్ పెరగడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. మరి విశాల్ సినిమా ఈ వారంలో ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

    English summary
    Vishal, who releases at least two films a year, has come to a clarity that this year is almost never going to be in theaters. But it seems that he will be releasing his film direct on OTT so as not to alienate the audience. The Corona pandemic boom in Tamil Nadu is growing day by day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X