»   »  విశాల్ కొత్త చిత్రం‘ఇంద్రుడు’రిలీజ్ డేట్

విశాల్ కొత్త చిత్రం‘ఇంద్రుడు’రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిట్ ఫ్లాపులతో సంభందం లేకుండా భాక్సాఫీస్ వద్ద వరస దండయాత్రలు చేస్తున్న విశాల్ మరో చిత్రం'ఇంద్రుడు'తో పలకరించటానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రం ఏప్రియల్ 11 న విడుదల చేయటానికి సిద్దం చేస్తున్నారు. తమిళంలో 'నాన్ సిగప్పు మనిదన్'టైటిల్ తో రూపొందిన ఈ చిత్రాన్నే తెలుగులో 'ఇంద్రుడు'గా రిలీజ్ చేయనున్నారు.

హీరోగా తిరు దర్శకత్వంలో యూటీవీ మోషన్ పిక్చర్స్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఇంద్రుడు' చిత్రం షూటింగ్ పూర్తయింది. కులు-మనాలి, జోధ్‌పూర్, చెన్నైలో షూటింగ్ జరిపామనీ తెలిపారు. ఇప్పటివరకూ జరిగిన చిత్రం షూటింగ్ రషెస్ చూసి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ థ్రిల్ ఫీలయ్యారనీ, బాలీవుడ్‌లో ఈ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనీ నిర్మాతలు చెప్పారు. 'గజరాజు' కథానాయికగా నటించిన లక్ష్మీమీనన్ ఈ సినిమాలో విశాల్ సరసన నటిస్తోంది.

Vishal's Indrudu coming on 11th

విశాల్‌ మాట్లాడుతూ ''తిరుతో మరోసారి జత కట్టడం ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్‌ అంశాలు మేళవించిన ఓ ప్రేమ కథ ఇది. వినోదానికి ప్రాధాన్యం ఉంది. సాంకేతికంగానూ ఈ చిత్రం ఉన్నత స్థాయిలో ఉంటుంది. కులుమనాలి, జోథ్‌పూర్‌, థాయ్‌లాండ్‌, చెన్నైలలో కీలక భాగం తెరకెక్కించాం. మిగిలిన రెండు పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. దాంతో షూటింగ్‌ పూర్తవుతుంది. నా కెరీర్‌లో ఇది మర్చిపోలేని చిత్రం అవుతుందన్న నమ్మకం ఉంది''అన్నారు.

ఇప్పటివరకూ జరిగిన చిత్రం షూటింగ్ రషెస్ చూసి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ థ్రిల్ ఫీలయ్యారనీ, బాలీవుడ్‌లో ఈ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనీ నిర్మాతలు చెప్పారు. 'గజరాజు' హీరోయిన్ గా నటించిన లక్ష్మీమీనన్ ఈ సినిమాలో విశాల్ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, ఫొటోగ్రఫీ: రిచర్డ్ ఎన్. నాథన్, దర్శకత్వం: తిరు.

English summary

 Vishal and Lakshmi Menon starrer Indrudu directed by Thiru is all set to release on April 11th. The film is currently under post production. Filmmakers said film was shot in Kulu Manali,Jodhpur,Chennai,Thailand and underwater liplock scenes are the highlight in the film. Plans are on to release the audio tuned by GV.Prakash Kumar this week. UTV Motion Pictures and Vishal Film Factory is producing the film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu