twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కర్నాటకలో 'విశ్వరూపం' పరిస్ధితి ఏంటి

    By Srikanya
    |

    బెంగుళూరు : కమల్‌ హాసన్‌ తాజా చిత్రం ' విశ్వరూపం' అనేక వివాదాలను మూట కట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం మంగళవారం కర్నాటకలో విడుదలైంది. తాము పూర్తి సెక్యూరిటీ కల్పిస్తామని రాష్ట్రపోలీసులు పంపిణీదారులకు హామీనిచ్చారు. రెస్పాన్స్ బాగుందని, మంచి లాభాలు వస్తాయని డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉన్నారు.

    '' రాష్ట్రవ్యాప్తంగా 40 సినిమాహాళ్లలో చిత్రం విడుదలైంది. దాంతో అక్కడ రిలీజైంది. ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. బెంగుళూరులో 17 హాళ్లలో విడుదలైంది. అన్నీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తున్నాయి'' అని కర్నాటకకు ఏకైక పంపిణీదారు హెచ్‌.డి.గంగరాజు మీడియాకి చెప్పారు. చిత్రం శాంతియుతప్రదర్శనకు తాము సెక్యూరిటీ కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

    '' ముస్లిం సంస్థల ప్రతినిధులు నగర కమిషనర్‌ జ్యోతిప్రకాష్‌ మిర్జీని కలసి చిత్రంలో ఒక్క వాక్యం అంటే ముస్లింలు అందరూ టెర్రరిస్టులు కారు అనేది చేర్చమని కోరారు. ఇది డిజిటల్‌ చిత్రం కావటం వల్ల అది సాధ్యం కాదు. కాని చిత్రం టైటిల్స్‌లో చేర్చేందుకు నిర్ణయించాను.'' అని గంగరాజు తెలిపారు. జనవరి 27న మిర్జీ ఈ చిత్రాన్ని చూశారు. తర్వాతే 28న చిత్రాన్ని కర్నాటకలో విడుదల చేసినట్లు గంగరాజు తెలిపారు. చిత్రంలో అభ్యంతరకర దృశ్యాలు లేవని మిర్జీ సంతృప్తి చెందారన్నారు.

    English summary
    Kamal Haasan’s controversial film “Vishwaroopam” was finally released today in Karnataka after the state police gave an assurance of providing adequate security for the multi-lingual film.
 “Vishwaroopam has been released in 40 theatres across the state, including 17 in Bangalore from the matinee show today. All 17 theatres screening the film are already going house-full,” sole distributor of the film in Karnataka, H.D. Gangaraju told
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X