Don't Miss!
- News
బాలకృష్ణకు `కాపు`నాడు వార్నింగ్: పెదవి విప్పని పవన్- `పొత్తు` పోతుందనే భయం..?!
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Waltair Veerayya's Day 3 Collections: సంక్రాంతిలో చిరు సెంచరీ.. బాలయ్య కంటే ధీటుగా బాక్సాఫీస్ బీభత్సం..
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతిలో ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు రోజురోజుకు కలెక్షన్స్ ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా ఒక విధంగా నందమూరి బాలకృష్ణ సినిమా కంటే ఎక్కువ స్థాయిలో రెండవ రోజు నుంచి డామినేట్ చేయడం స్టార్ట్ చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వాల్తేరు వీరయ్య ఎంత కలెక్ట్ చేశాడు అలాగే ప్రాఫిట్ లోకి రావాలి అంటే ఇంకా ఏ స్థాయిలో కలెక్షన్స్ రావాలి? అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..
వాల్తేరు వీరయ్య సినిమా తన రేంజ్ కు తగ్గట్టుగానే రెండు రాష్ట్రాల్లో కూడా మంచి బిజినెస్ చేశాడు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 72 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక కర్ణాటకలో 5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్ లో 9 కోట్లు.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా కలిసి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 88 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది.

మళ్ళీ పెరిగిన కలెక్షన్స్
వాల్తేరు వీరయ్య సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు మొదటి రోజు ఏపీ తెలంగాణలో 22.90 కోట్లు వచ్చాయి. ఇక రెండవ రోజు ఒకసారిగా తగ్గిపోయాయి. 11.95 కోట్లు మాత్రమే వచ్చాయి. మూడవరోజు మాత్రం మరి కాస్త డోస్ పెంచిన పైగాస్టార్ 12.61 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు.

3వ రోజు కలెక్షన్స్
మూడవరోజు ఏరియాలో వారీగా వాల్తేరు వీరయ్య సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం ఏరియాలో 5.10 కోట్లు సీడెడ్ లో 2.48 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.54 కోట్లు, ఈస్టులో 98 లక్షలు, వెస్ట్ లో 46 లక్షలు, గుంటూరులో 69 లక్షలు, కృష్ణాలో 90 లక్షలు, నెల్లూరు 46 లక్షలు.. ఇలా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మూడవరోజు 12.61 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. 20.90 కోట్ల గ్రాస్ వచ్చింది.

ఏపీ తెలంగాణ 3 డేస్ కలెక్షన్స్
ఇక మూడు రోజుల్లో వాల్తేరు వీరయ్య వీరయ్య ప్రపంచవ్యాప్తంగా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజం ఏరియాలో 16.16 కోట్లు, సీడెడ్ లో 9.16 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.5 కోట్లు, ఈస్టులో 4.54 కోట్లు, వెస్టులో 2.88 కోట్లు, గుంటూరులో 4.11 కోట్లు, కృష్ణ లో 3.19 కోట్లు, నెల్లూరులో 1.87 కోట్లు వచ్చాయి. ఇక మొత్తం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమాకు 47.46 కోట్ల షేర్ కలెక్షన్స్, 76.80 కోట్ల గ్రాస్ దక్కింది.

వరల్డ్ వైడ్ గా.. చిరు సెంచరీ
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.90 కోట్లు కలెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమా ఓవర్సీస్ లో ఊహించిన విధంగా 7.5 కోట్లను అందుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమాకు 58.91 కోట్లు వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక గ్రాస్ కలెక్షన్స్ అయితే 108.95 కోట్లు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద మరోసారి సెంచరీ కొట్టడంతో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది.

ఇంకా ఎంత రావాలి?
ఇక వాల్తేరు వీరయ్య సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం మొదటి మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మొత్తంగా 89 కోట్ల టార్గెట్ తో మార్కెట్లోకి రాగా.. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 58.91 కోట్ల వరకు షేర్ అందుకుంది. అంటే లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 30.09 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి ఆ టార్గెట్ ను మెగాస్టార్ ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో చూడాలి.