»   » సంక్రాంతి సినిమాలు...ఏది హిట్?

సంక్రాంతి సినిమాలు...ఏది హిట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్మాతలు, హీరోలు చాలా ఉత్సాహం చూపిస్తూంటారు. దానికి కారణం తెలుగు వారికి పెద్ద పండుగ కావటం, కలిసివచ్చే శెలవలు. ఈ సంక్రాంతి పండగ బరిలో ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో', బాలకృష్ణ 'డిక్టేటర్', నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి భారీ చిత్రాలతో పాటు 'ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రం విడుదలైంది. సంక్రాంతి సీజన్ లో ఈ నాలుగూ..టాక్ తో సంభంధం లేకుండా కలెక్ట్ చేసాయి. దాంతో నిన్నటితో శెలవలు ముగియనుండటంతో ఈ రోజు నుంచే ఈ సినిమాలు పరీక్ష మొదలైనట్లైంది. ఏ సినిమాకు ఈ రోజు నుంచి ప్రేక్షకులు వస్తారో ఆ సినిమానే సంక్రాతి విన్నర్ అని తేలిపోతుంది.

చిత్రంగా ఈ నాలుగు చిత్రాలు ఇనానమస్ హిట్ టాక్ చెచ్చుకోలేకపోయాయి. తాము టార్గెట్ చేసిన ప్రేక్షకులకు చేరేటట్లుగా రూపొందినట్లుగా ఈ సినిమాలు ఉన్నాయి. దాంతో వీటిన్నటికీ వన్ సైడ్ టాక్ మాత్రమే వచ్చింది. ఏ సినిమాకూ బ్లాక్ బస్టర్ అనిపించుకోలేకపోయింది.


అయితే ఇవన్నీ ఓపినింగ్స్ పరంగా భారీగానే ఉన్నాయి. ఒక్క ఎక్సప్రెస్ రాజాకు తప్ప అన్నిటికీ ఓపినింగ్స్ బాగా వచ్చాయి. అలాగే ధియోటర్స్ సంఖ్యని బట్టే కలెక్షన్స్ కూడా ఆధారపడిన రోజులు కావటంతో ఈ రోజు నుంచి భారీగా రిలీజైన సినిమాలకు గండం రాబోతోంది.


స్లైడ్ షోలో ఆ సినిమాల బలాబలాలు చూద్దాం...


ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'

ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'

ఈ చిత్రం అయితే క్లాస్ కు నచ్చింది. ముఖ్యంగా మల్టిఫ్లెక్స్ లలో బాగా కలెక్ట్ చేస్తోంది. దాంతో బి,సి సెంటర్లలలో రిజల్ట్ చెప్పుకోదగిన రీతిలో లేదు.బాలకృష్ణ 'డిక్టేటర్'

బాలకృష్ణ 'డిక్టేటర్'

నాన్నకు ప్రేమతో చిత్రానికి పూర్తి రివర్స్ లో ఉంది రిజల్ట్. క్లాస్ కు అసలు ఎక్కడం లేదు. బి,సి సెంటర్లలలో మాత్రం కుమ్మేస్తోందని టాక్.


నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా'

నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా'

ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి స్పందన బాగున్నా...మాస్ హీరో కాకపోవటంతో ఫ్యామిలీలు మాత్రమే టార్గెట్. దాంతో రికార్డ్ లు క్రియేట్ చేసే పరిస్ధితి లేదు.


'ఎక్స్‌ప్రెస్ రాజా'

'ఎక్స్‌ప్రెస్ రాజా'

ఇది కామెడీ ప్రియులకు నచ్చే మల్టిఫ్లెక్స్ మూవిగా మిగిలింది. శర్వానంద్ కు ఉన్న ఆడియన్స్ పరంగానూ ఇది క్లాస్ సెంటర్లలో బాగా కలెక్ట్ చేస్తోంది. బి,సి లలో ఈ సినిమా ప్రబావం లేదు.


English summary
Pongal festive atmosphere is slowly receding, the real test for all the Shankranti films would begin from today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu