ఈ సంక్రాంతికి తొడగొట్టేది ఎవరు?
హైదరాబాద్ : మరో పది రోజుల్లో నాలుగు తెలుగు సినిమాల భవష్యత్ తెలిపోనుంది. ముందిగా ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో జనవరి 13 న రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాటు తారక్. గత కొద్ది కాలంగా..గెలుపు దోబుచులాడుతోంది ఈ యంగ్ హీరోతోటి.
అలాగే జనవరి 14, 15 తారీఖుల్లో మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. ఎంతో ప్రతిష్థాత్మకంగా రూపోందుతున్న బాలకృష్ణ సినిమా డిక్టేటర్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెన్సార్ బోర్డు దగ్గరా వేచి చూస్తోంది. బాలకృష్ణకు 99 సినిమా అవడం దీనిని ప్రేస్టేజియస్ గా తీసుకుంటున్నారు.

ఇక నాగర్జున సోగ్గాడే చిన్నినాయిన అంటూ రాబోతున్నాడు ఈ అక్కినేని అందగాడు. తండ్రి,కొడుకు, దెయ్యం అంటూ వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమవుతుందో వేచి చూడాలి.
మరో ప్రక్క పెద్ద హీరోలకు సైతం బయపడకుండా, తన స్టామినా పెంచుకోవాలని తహతహలాడుతున్న హీరో శర్వానంద్. ఎక్స్ ప్రెస్ రాజాగా దుసుకొస్తున్న ఈ కుర్రహీరోకు బ్రేకులు పడాతాయో లేక జోరుగా సాగిపోతుందో చూడాలి.
ఎది ఎమైనా ఈ నాలుగు సినిమాల భవిష్యత్ మరో 10 రోజుల్లో తేలిపోనుంది. వీటిలో సంక్రాంతి హీరో ఎవరనేది స్పష్టం అయిపోతుంది. కాకపోతే సంక్రాంతి కావడం వల్ల ఈ సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా జనం చూడాటానికి ఇష్టపడతారు దానితో ఈ సినిమాలకు బిజినేస్ డోకా వుండదని ట్రేడ్ వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











