»   » 'నాన్నకు ప్రేమతో'..మంచు తుఫాన్ దెబ్బ

'నాన్నకు ప్రేమతో'..మంచు తుఫాన్ దెబ్బ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మిడ్ అట్లాంటిక్, నార్త్ ఈస్ట్ (యుఎస్‌) ఏరియాల్లో ముంచుకొచ్చిన మంచు తుఫాన్‌ 'నాన్నకు ప్రేమతో' కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తోందని సమాచారం.ఈ తుఫాన్ ప్రభావంతో చాలా చోట్ల జనం బయటకి రాలేని పరిస్థితి నెలకొని ఉంది. ఈ తుఫాన్ ప్రబావంతో థియేటర్లు కూడా మూతబడ్డాయి. దాంతో ఖచ్చితంగా ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాలపై ఈ ఎఫెక్ట్ పడుతుందంటున్నారు. రెండు మిలియన్ డాలర్ల మార్క్ వైపు దూసుకువెళ్తున్న నాన్నకు ప్రేమతో కు ఇది ఊహించని దెబ్బే. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ మాట్లాడుతూ ...నాకు జీవితాంతం గుర్తుండిపోయే ఇలాంటి సినిమా ఇచ్చినందుకు దర్శకుడు సుకుమార్‌గారికి కృతజ్ఞతలు. జీవితంలో వెనక్కితిరిగి చూసుకుంటే గొప్పగా చెప్పుకోదగ్గ సినిమా ఒకటి వుండాలి. అలాంటి సినిమాను నాకు సుకుమార్ అందించినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమాకు సుకుమార్, నిర్మాత భోగవల్లి ప్రసాద్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ఈ నాలుగురు మూలస్థంభాలుగా నిలిచారు. సినిమాకు వచ్చిన కలెక్షన్‌ల కంటే వచ్చిన రెస్పెక్టే ఎక్కువ అన్నారు.


Winter storm may affect Nannaku Prematho

జగపతిబాబు మాట్లాడుతూ సుకుమార్ సినిమా అంటే హిట్ లిస్ట్‌లో వుంటుంది. ఈ సినిమా విడుదలైన తరువాత కొంత మంది ఏ సెంటర్ సినిమా అని, కొంత మంది బి సెంటర్ సినిమా అని రకరకాలుగా చెప్పారు. అదేంటో నాకు అర్థం కాలేదు. సినిమా మాత్రం అన్ని వర్గాల్ని అలరిస్తోంది అన్నారు.


రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ సినిమా అంటే విజిల్స్ వేసే ప్రేక్షకులు ఈ చిత్రంతో అతన్ని తమ గుండెల్లో దాచుకుంటున్నారు. సినిమా విడుదలైన రోజు వచ్చిన స్పందనకు ఈ రోజు వస్తున్న స్పందనకు చాలా తేడా వుంది. సినిమా టైటిల్ దగ్గరి నుంచి చాలా విషయాల్లో లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్క పర్‌ఫెక్ట్ అని తేలింది. ఈ సినిమా చూసిన నా భార్య మీ పాత్రకు ఎక్కువగా డైలాగ్‌లు లేకపోయినా బాగా నటించారని చెప్పడం ఆనందంగా వుంది అన్నారు.


ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, విలన్ గా జగపతి బాబు, ఇతర ముఖ్య పాత్రల్లో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

English summary
A snow storm is approaching Mid-Atlantic & Northeast areas of USA might affect the box office collections of Nannaku Prematho and other Telugu Movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu