Just In
- 57 min ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
- 1 hr ago
అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
- 1 hr ago
మరోసారి మీ పాదాలను తాకాలని ఉంది.. ఎస్పీబీని తలుచుకుంటూ సునీత ఎమోషనల్
Don't Miss!
- News
ప్రపంచంలో తొలి సింగిల్ డోసు టీకా -జాన్సన్ అండ్ జాన్సన్ తయారీ కొవిడ్ వ్యాక్సిన్‌కు అమెరికా ఆమోదం
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వరల్డ్ ఫేమస్ లవర్ తొలిరోజు కలెక్షన్స్: అన్ని ఏరియాల్లో కలిపి ఎంత రాబట్టిందంటే..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ 'వరల్డ్ ఫేమస్ లవర్'. ప్రపంచవ్యాప్తంగా లవర్స్ డే కానుకగా నిన్న (ఫిబ్రవరి 14) విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ పోషించిన డిఫరెంట్ రోల్స్ ఆకట్టుకున్నాయనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తొలిరోజు ముగిసేసరికి 'వరల్డ్ ఫేమస్ లవర్' ఎంత వసూలు చేసింది? కలెక్షన్స్ వివరాలేంటి? దానిపై ఓ లుక్కేద్దామా..

నలుగురు హీరోయిన్స్.. విజయ్ రొమాంటిక్ డోస్
'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో విజయ్ సరసన ఏకంగా నలుగురు హీరోయిన్స్ నటించారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా లీట్, క్యాథెరిన్ ట్రెసా విజయ్‌తో ఆడిపాడారు. వీళ్లంతా ఎవరికి వారు గ్లామర్ బ్యూటీలే కావడంతో సినిమాకు హీరోయిన్స్ పార్ట్ ప్లస్ అయింది. విజయ్ రొమాంటిక్ డోస్ యూత్‌ని ఆకట్టుకుంది.

భారీ రిలీజ్.. 1000కి పైగా థియేటర్స్
'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాను భారీ రేంజ్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం నైజాంలో 260+, సీడెడ్ లో140+, ఆంధ్రాలో 320+ మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 720+ థియేటర్స్ కేటాయించారు. ఇక ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుంటే మొత్తంగా 1150+ థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది వరల్డ్ ఫేమస్ లవర్.

ఓ రేంజ్ ప్రమోషన్స్.. ఫస్ట్ డే ఆక్యుపెన్సీ
'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రానికి షూటింగ్ దశ నుంచే ఓ రేంజ్ ప్రమోషన్స్ నిర్వహించారు. హీరోయిన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని టీజర్, ట్రైలర్ ఇలా అన్నింటా ప్రత్యేకత చాటుకున్నారు. దీంతో భారీ అంచనాలు నెలకొని రిలీజ్ బజ్ ఏర్పడింది. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 70.19% ఆక్యుపెన్సీ కనిపించింది.

తొలిరోజు కలెక్షన్స్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో
ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ వసూలయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి 5.5 కోట్ల నుంచి 6.5 కోట్ల మేర కలెక్ట్ అయినట్లు రిపోర్ట్స్ అందాయి. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 7 నుంచి 8 కోట్లు రాబట్టినట్లు తెలిసింది.


'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రీ రిలీజ్ బిజినెస్
తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ చిత్రమంటే యూత్‌లో ఎనలేని క్రేజ్ ఉంటుంది. దానికి తగ్గట్టే విజయ్ చిత్రాలకు మంచి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. వరల్డ్ ఫేమస్ లవర్ కూడా భారీ రేటుకు అమ్ముడైనట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర హక్కులు దాదాపు 18 కోట్లకు సేల్ అయ్యాయి. రెస్టాఫ్ ఇండియాలో 2.5కోట్లు, ఓవర్సీస్‌లో 3.2కోట్లు.. మొత్తంగా ఈ మూవీ 23.81కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.