Writer Padmabhushan day 1 Collections రైటర్ పద్మభూషణ్‌కు భారీ ఓపెన్సింగ్.. తొలి రోజు ఎంతంటే?
చాయ్ బిస్కట్ ఫిలింస్, లహరీ మ్యూజిక్ బ్యానర్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ నిర్మాతలుగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రైటర్ పద్మభూషణ్. కలర్ ఫోటోతో విమర్శకులు ప్రశంసలు అందుకొన్న సుహాస్ నటించిన ఈ చిత్రంలో ఆశీష్ విద్యార్థి, రోహిణి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. సుహాస్‌తో టీనా శిల్పరాజ్, శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..

రిలీజ్‌కు ముందే 27 ప్రీమియర్లు
రచయితగా పేరు తెచ్చుకోవాలనే ఓ అసిస్టెంట్ లైబ్రేరియన్ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలు, మదర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్‌కు ముందే విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్‌లో దాదాపు 27 ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. రిలీజ్‌కు ముందే వస్తున్న ఫీల్‌గుడ్ రెస్సాన్స్‌తో భారీ అంచనాలు పెరిగాయి.

భారీగా స్క్రీన్లు, ఓవర్సీస్‌లో భారీ క్రేజ్
రైటర్ పద్మభూషణ్ సినిమాకు ప్రీమియర్ల ద్వారా మంచి క్రేజ్ లభించడంతో అమెరికా, తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేట్రికల్ రన్ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో రిలీజైంది. అమెరికాలో దాదాపు 150 స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాను సుమారు 6 కోట్లతో రూపొందించినట్టు సమాచారం. అయితే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ద్వారా సొంతంగా రిలీజ్ చేశారు.

విదేశాల్లో అదనపు స్క్రీన్లు
రైటర్ పద్మభూషణ్ సినిమాకు క్రేజ్ పెరగడంతో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా కెనడా, తెలంగాణ, ఏపీ, చెన్నై, వెల్లూరు, బెంగళూరు, ముంబై, పూణే, ఒరిస్సాలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి భారీగా డిమాండ్ రావడంతో అదనంగా స్క్రీన్లను పెంచుతున్నారు.

రైటర్ పద్మభూషణ్ తొలి రోజు ఆక్యుపెన్సీ
రైటర్ పద్మభూషణ్ సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 30 శాతం ఆక్యుపెన్సీ, బెంగళూరులో 24 శాతం, చెన్నైలో 58 శాతం, విజయవాడ 34 శాతం, గుంటూరులో 30 శాతం, వైజాగ్‌తో 26 శాతం, కాకినాడలో 42 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

రైటర్ పద్మభూషణ్ తొలి రోజు కలెక్షన్లు
రైటర్ పద్మభూషణ్ సినిమా తొలి రోజు తన స్థాయికి మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజున 2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫస్ట్ టైమ్ థియేట్రికల్ రిలీజ్‌తో వస్తున్న సుహాస్‌కు ఇది మంచి ఓపెనింగ్ అవుతుందని పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











