twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాఫ్ ఎఫెక్ట్...తెలుగుకి నమస్కారం అంటున్నారు

    By Srikanya
    |

    Yash Raj's South Debut turns out to be a Disaster
    హైదరాబాద్: తెలుగులో పెద్ద సంస్ధలకు ఎందుకనో కలిసిరావటం లేదు. గతంలో యూటీవీ వారు ఇక్కడ మహేష్ తో అతిథి చిత్రం తీసి ప్లాఫ్ కొట్టారు. దాంతో తర్వాత చాలా కాలం పాటు ఇక్కడ సినిమాలు చేయటానికి ఇష్టం చూపలేదు. అలాగే బాలీవుడ్ లో పెద్ద నిర్మాణ సంస్ధలలో ఒకటి యశ్‌రాజ్‌ సంస్థ. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తోందంటే సినిమా లవర్స్ మొత్తం ఎదురు చూస్తారు. తమ సంస్ధ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ సంస్ధ రీసెంట్ గా తెలుగు,తమిళ భాషల్లో 'ఆహా కళ్యాణం' అంటూ దిగింది. ఈ సినిమా తర్వాత వారికి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో వరసగా సినిమాలు చేయాలనే ఆలోచన. ఈ మేరకు వారు ప్లాన్స్ కూడా తయారుచేసుకున్నారు. అయితే తొలి చిత్రమే భాక్సాఫీస్ వద్ద బాంబ్ లా పేలటంతో వారు పూర్తిగా వెనక్కి తగ్గారని ట్రేడ్ వర్గాల సమాచారం. డీసెంట్ గా ఉందని టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ అయ్యింది.

    చిత్రం కథేమిటంటే... వెడ్డింగ్ ప్లానర్ గా ఎదగాలనుకునే శక్తి సుబ్రమణ్యం(వాణి కపూర్)కి గాలికి తిరిగే శక్తి(నాని) తారసపడతారు..వెంటబడతాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా తర్వాత అతతో కలిసి గట్టిమేళం అని వెడ్డింగ్ ఫ్లానింగ్ ఆఫీస్ ఓపెన్ చేస్తుంది. కష్టపడి,ఇష్టపడి చేయటంతో వీరి కంపెనీ త్వరలోనే ఎదుగుతుంది. ఆ ఉత్సాహంలో ..ఆ సెలబ్రేషన్ మూడ్ లో అనుకోని విధంగా ఇద్దరూ శారీరకంగా ఒకటవుతారు. అయితే అతనికి రిలేషన్ షిప్స్ లో ఇరుక్కోవటం ఇష్టం ఉండదు. అక్కడ నుంచివీరిద్దరివి వేరే దారులు అవుతాయి. చివరకు వీరిద్దరూ ఒకటి ఎలా అయ్యారు అనేది మిగతా కథ.

    రొమాంటిక్ కామెడీలు చెప్పేవిధంగా చెప్తే ఎప్పుడూ బాగానే ఉంటాయి. అందులోనూ ఒక చోట ప్రూవ్ అయిన కథ కూడా కావటంతో కథా పరంగా పొరపాట్లు ఏమీ కనపడవు. అయితే దర్శకుడు ఒరిజనల్ బ్యాండ్ బజా భరత్ చిత్రాన్ని ఉన్నదున్నట్లు మక్కీ కి మక్కీ దింపేసి ప్రయత్నం చేసాడు. అక్కడక్కడా నేటివిటీ అద్దాననుకున్నాడు కానీ అది తమిళ అతి అయి కూర్చుంది. దాంతో అసలే రీమేక్ ..ఆపే డబ్బింగ్ అన్నట్లై కూర్చుంది. అయితే హిందీలో వర్కవుట్ అయ్యింది అనుష్క శర్మ అద్వితీయమైన నటనా సామధ్యం, ఆమె గ్లామర్. అదే ఇక్కడ కొరవడింది. హీరో,హీరోయిన్స్ కెమిస్ట్రీ చాలా చోట్ల మిస్సైంది. కొన్ని సన్నివేశాల్లో నాని..ఆమె ప్రక్కన తమ్ముడులా కనిపించాడంటే అది దర్సకుడు తప్పే. అలాగే సెకండాఫ్ లో ఎమోషనల్ డెప్త్ కొరవడింది. హిందీలో వర్కవుట్ అయ్యిందే సెకండాఫ్ లో సన్నివేశాలు. . నాని హీరోగా నటించిన చిత్రం 'ఆహా కళ్యాణం'. వాణీ కపూర్‌ హీరోయిన్. గోకుల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఆదిత్య చోప్రా నిర్మాత.

    English summary
    Aaha Kalyanam, Popular Bollywood Banner Yash Raj Films entry ticket into South has bombed big time at the Boxoffice. Both Tamil & Telugu Dub versions released on Feb 21st are disappointments at the Boxoffice.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X