»   » కలెక్షన్స్ సునామీ: 3రోజుల్లో 60కోట్లు

కలెక్షన్స్ సునామీ: 3రోజుల్లో 60కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై : రణబీర్‌ కపూర్‌, దీపికా పదుకోని జంటగా నటించిన తాజా చిత్రం యే జవానీ హై దివానీ . ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. అప్పుడే కలెక్షన్స్ సునామీలా ..కురుస్తూ...రు.100 కోట్ల క్లబ్‌లోకి దూసుకుపోతోంది. మొదటి మూడురోజులలోనే రు.62 కోట్లు వసూలుచేసి సిని పండితులను ఆశ్చర్యపరుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా 3,000 ధియేటర్‌లలో విడుదలైందని, ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోందని, నిర్మాతలైన యూటీవీ సంస్థ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేకప్‌ సిద్‌ చిత్రంతో బాలీవుడ్‌ ప్రవేశంచేసిన దర్శకుడు అయన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాధురి దీక్షిత్‌ ప్రత్యేకగీతంలో నటించారు.

హీరోయిన్ దీపిక పదుకోని మాట్లాడుతూ 'నా గత చిత్రం 'కాక్‌టెయిల్'లో ఆధునిక భావాలు వున్న వెరోనికా పాత్రను చేశాను. నా రియల్‌లైఫ్‌కు దగ్గరగా వుండే పాత్ర అది. తాజాగా 'యే జవానీ హై దివానీ' చిత్రంలో ఆ తరహా పాత్రను చేసాను. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నా నిజ జీవితంలోని ప్రేమ తాలూకు స్వీయ అనుభవాలు గుర్తుకు వచ్చాయి. అందుకే నటించడం ఏ మాత్రం కష్టమనిపించలేదు. ఇలాంటి పాత్రలు దొరికితే పెద్దగా నటించాల్సిన అవసరం వుండదని నా ఆభిప్రాయం' అని చెప్పింది.

English summary
"Yeh Jawaani Hai Deewani" is zooming towards the Rs.100 crore club. The Ranbir Kapoor-Deepika Padukone starrer has managed business of Rs.62.11 crore at the Indian box office in the opening weekend itself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu