For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇలా చేసారేంటి: అజిత్ అభిమానులు నిరాస

  By Srikanya
  |

  హైదరాబాద్: తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన 'ఎన్నై అరిందాల్' నిన్న (గురువారం) తమిళనాడులో గ్రాండ్‌‌గా విడుదలైంది. గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అనుష్క, త్రిష హీరోయిన్లు. సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి ఇపుడు రిలీజైంది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే చర్చ. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లోని అజిత్ అభిమానులు సైతం ఈ చిత్రాన్ని చూడాలని ఉత్సాహ పడ్డారు. ఈ చిత్రాన్ని మల్టిప్లెక్స్ లలో విడుదల చేస్తారని భావించారు. కానీ హైదరాబాద్ అభిమానులను నిరాసపరిచేలా ఇక్కడ దాన్ని విడుదల చేయలేదు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  త్వరలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నామన్న ఉద్దేశ్యంతో ఇక్కడ దాన్ని విడుదల చేయలేదని సమాచారం. దాంతో చాలా మంది ఈ చిత్రం చూద్దామనుకుని ఆన్ లైన్ బుక్కింగ్ లో లేకపోయేసరికి షాక్ అయ్యి..మల్టిఫ్లెక్స్ లకు ఫోన్ చేసి ఇక్కడ రిలీజ్ కావటం లేదని తెలుసుకుంటన్నారు. అయితే ఇక్కడ కూడా రిలీజ్ చేస్తే బాగుండేది అంటున్నారు. ఎందుకంటే ఇలా హిట్ టాక్ వచ్చినప్పుడు దాన్ని ఎలాగైనా చూడాలి...ఇక్కడ మనకు లేదు అన్నప్పుడు పైరసీని ఆశ్రయించే అవకాసముందని అంటున్నారు. మరి నిర్మాతలు ఈ విషయంలో దృష్టి పెడితే బాగుండేది. ఇక తెలుగు వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అనేది ఇప్పటివరకూ క్లారిటీ లేదు.

  Yennai Arindhaal: Ajith Fans Got Disappointed!

  ఇక ‘ఐ' సినిమాతో పోటీ పడటం ఇష్టం లేకనే సినిమాను వాయిదా వేసారి అప్పట్లో టాక్. కానీ ఈ సినిమా అపుడు విడుదలయి ఉంటే ‘ఐ' సినిమాకు భారీ నష్టం జరిగి ఉండేదని సినిమా చూసిన వారు అంటున్నారు. ఆ రేంజిలో ఉంది మరి ఈ సినిమా టాక్. ఈ చిత్రం భారీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గతంలో అజిత్ నటించిన సినిమాలు వరుసగా విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రంపై ముందు నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో అజిత్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

  మరో ప్రక్క ఈ చిత్రానికి సంభందించిన ఆన్ లైన్ క్యామ్ ప్రింట్ కు సంభందించిన స్క్రీన్ షాట్స్ వి సోషల్ మీడియాలో కనపడటం అభిమానులను కంగారు పెడుతున్నాయి. అయితే దర్శకుడు, నిర్మాత మాత్రం అటువంటిదేమీ జరగలేదని అంటున్నారు. చాలా టైట్ సెక్యూరిటీతో ప్రతీ సీన్ ని కాప్చర్ చేసామని, అది డూపిల్ కేట్ ప్రింట్ అయ్యి ఉండవచ్చుని అంటున్నారు. మరో ప్రక్కన అజిత్ వీరాభిమానులు మాత్రం పైరసీని ఎంకరేజ్ చేయవద్దని, థియోటర్ లో బిగ్ స్కీన్ మీద మాత్రమే తమ హీరో చిత్రం చూడాలని పిలుపు ఇచ్చారు.

  చిత్రం విషయానికి వస్తే...

  Yennai Arindhaal: Ajith Fans Got Disappointed!

  అజిత్‌ హీరోగా నటిస్తున్న 'ఎన్నై అరిందాల్‌' చిత్రానికి ముగ్గురు దర్శకత్వం వహించినట్లు తెలిసింది. ఈ చిత్ర ప్రధాన దర్శకుడు గౌతం మీనన్‌. గౌతం మీనన్‌ మాట్లాడుతూ '' ఈ చిత్రం అజిత్‌ కోసమే సిద్ధం చేశా. చిత్రీకరణ తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని భావిస్తున్నాం. ఈ కారణంగా నాతోపాటు దర్శకులు శ్రీధర్‌ రాఘవన్‌, త్యాగరాజ కుమారరాజ పనిచేస్తున్నారు. వారిని సాయం కోరగానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టార''అని తెలిపారు.

  అజిత్‌ మాట్లాడుతూ.. '' ఇది ఎప్పటిలాగానే నాకోసం తయారైన చిత్రంలా ఉండకూడదు. ప్రత్యేకించి గౌతమ్‌ మీనన్‌ తరహాలో రూపొందించిన సినిమాలా కనిపించాలన్నదే నా అభిమతము''అని వివరించారు. తెలుగులో ఈ చిత్రం ‘ఎంతవాడుగానీ'..అనే టైటిల్ తో విడుదల అవుతుందంటున్నారు. కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వలేదు.

  చిత్రం వివరాల్లోకి వెళితే..

  స్టార్‌ హీరో అజిత్‌, గౌతమ్‌ మీనన్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ ఎంతవాడుగానీ '. ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం పర్యవేక్షణలో శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మస్తున్న ఈ చిత్రంలో అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ ఐ ', ‘ లింగ ' చిత్రాల తరహాలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది.

  Yennai Arindhaal: Ajith Fans Got Disappointed!

  దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ మాట్లాడుతూ - ‘‘ ఇందులో మూడు షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో అజిత్‌ నటిస్తున్నారు. అనుష్క ఫారిన్‌ నుంచి వచ్చిన మోడ్రన్‌ గర్ల్‌గా నటిస్తుండగా, త్రిష సంప్రదాయ కుంటుంబం నుంచి వచ్చిన క్లాసికల్‌ డాన్సర్‌గా చేస్తున్నారు. ఇంతకుముందు తమిళ్‌లో హీరోగా చాలా సినిమాల్లో నటించిన అరుణ్‌ విజయ్‌ ఈ చిత్రంలో అజిత్‌కి ఈక్వెల్‌గా వుండే నెగెటివ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఆయన సరసన పార్వతి నాయర్‌ నటిస్తున్నారు. ఆశిష్‌ విద్యార్థి, సుమన్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. హారీస్‌ జైరాజ్‌ ఈ చిత్రానికి ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఇందులో ఏడు పాటలు వుంటాయి. అజిత్‌ కాంబినేషన్‌లో నేను చేస్తున్న ఈ సినిమా మరో సెన్సేషనల్‌ కమర్షియల్‌ ఫిలిమ్‌ అవుతుందన్నారు.''

  నిర్మాత ఎస్‌.ఐశ్వర్య మాట్లాడుతూ- ‘‘ ఎనిమిది నెలలుగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగింది. చెన్నై, రాజమండ్రి, మలేషియా వంటి డిఫరెంట్‌ ప్లేసెస్‌లో షూటింగ్‌ చేశాము. అలాగే జోధ్‌పూర్‌, జైపూర్‌, పెల్లింగ్‌, గ్యాంగ్‌టక్‌ వంటి ప్రదేశాల్లో అజిత్‌పై చిత్రీకరించిన పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది.

  ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్‌ అయిన తమిళ చిత్రం టీజర్‌కి యూ ట్యూబ్‌లో ఇప్పటికే 10 లక్షల హిట్స్‌ వచ్చాయి. ఎన్‌.టి .రామారావు గారి సూపర్‌హిట్‌ సాంగ్‌ అయిన ‘ఎంతవాడు గానీ, వేదాంతులైన గానీ' అనే పాటలోని పల్లవిని తీసుకొని ఎంతవాడు గానీ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి పెట్టడం జరిగింది.'' అన్నారు.

  English summary
  Ajith fans in Hyderabad expected that Yennai Arindhaal will be releasing Sameday in nearby multiplexes and they can happily watch it. As a surprise for many Yennai Arindhaal movie is unavailable for online booking in Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X