»   » ‘ఎవడు' బిజినెస్ క్లోజ్...కలెక్షన్స్ లిస్ట్

‘ఎవడు' బిజినెస్ క్లోజ్...కలెక్షన్స్ లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పండగ సీజన్ లో సినిమాకు హిట్ టాక్ రావటం కలెక్షన్స్ పరంగా ప్లస్ అయ్యింది. ఈ చిత్రం బిజినెస్ 47 కోట్ల దగ్గర ఆగిందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రం పోటీ అయిన 1 నేనొక్కడినే కమర్షియల్ గా డ్రాప్ అవటం కూడా సినిమాకు కలిసివచ్చింది. అయితే ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉండటంతో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు.

 ‘Yevadu’ ends its business with 47 crores

ఇరవై రోజుల కలెక్షన్స్ (ఏరియావైజ్)

నైజాం: రూ. 12.26 కోట్లు

సీడెడ్: రూ. 7.66 కోట్లు

నెల్లూరు: రూ. 2.09 కోట్లు

కృష్ణా: రూ. 2.38 కోట్లు

గుంటూరు: రూ. 3.50 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ. 4.63 కోట్లు

ఈస్ట్ గోదావరి: రూ. 3.31 కోట్లు

వెస్ట్ గోదావరి: రూ. 2.74 కోట్లు

టోటల్ ఏపీ షేర్ : రూ. 21.84 కోట్లు

కర్నాటక : రూ.5.07 కోట్లు

రెస్టాఫ్ ఇండియా : రూ. 1.05 కోట్లు

టోటల్ ఆంధ్రా : రూ. 38.57 కోట్లు

ఓవర్ సీస్: రూ. 1.83 కోట్లు

మొత్తం వరల్డ్ వైడ్: రూ. 46.52 కోట్లు


చిత్ర దర్శకులు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ 3 సంవత్సరాలపాటు నిద్రకు దూరమయ్యానని, ఇంత కష్టానికి ప్రేక్షకులు అందించిన తీయని విజయం సంతోషాన్నిస్తోందన్నారు. తెలుగు ప్రజలున్నంత కాలం తెలుగు చిత్రసీమ పదిలంగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణ మరువరానిదని కృతజ్ఞతలు తెలిపారు. కథాపరంగా రామ్‌చరణ్‌తోపాటు మరో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ కేవలం కథను నమ్మి ఈ సినిమాలో నటించటం ఎప్పటికీ మరచిపోలేనన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ సంవత్సరంన్నర పాటు శ్రమించి ఎవడు చిత్రీకరించామని 6 నెలల పాటు కొన్ని కారణాల వలన విడుదల చేయలేకపోయామన్నారు. చిత్రం విడుదల ఆలస్యం కావటంతో అనేక వదంతులు వచ్చాయని, వేటినీ తాము లెక్కచేయలేదని, కథాబలం ఉండటం వలనే ప్రేక్షకులు చిత్రానికి విజయం అందిచారన్నారు.


చిత్రం మళయాళి వెర్షన్ త్వరలో కేరళ అంతటా భారీ ఎత్తువ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అక్కడ రైట్స్ తీసుకున్న నిర్మాత థియోటకల్ వెర్షన్ రిలీజ్ చేసారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో ఫుల్ గా హల్ చల్ చేస్తోంది. ఆ ట్రైలర్ చూసిన మళయాళిలో ఈ మాస్ మసాలా సినిమాని ఓ రేంజిలో ఎత్తుతున్నారు. రిలీజ్ కు ముందే ఇంత హంగామా ఉంటే రిలీజ్ అయితే గ్యారెంటీ హిట్టే అని అక్కడ విడుదల చేస్తున్న మంజు అంటున్నారు.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఎవడ కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. మళయాళ వెర్షన్ కు గానూ...భయ్యా అనే టైటిల్ పెట్టారు. మై బ్రదర్ అనేది ట్యాగ్లైన్. కె.మంజు అనే నిర్మాత ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. మొదట ఈ చిత్రం జనవరి 24 న విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడది జనవరి 31 కి వాయిదా వేసారు. పోస్ట్ ప్రొడక్షన్ లో డిలే వల్ల పనులు లేటు అవుతున్నాయని చెప్తున్నారు.

English summary
Ram Charan’s ‘Yevadu’ has closed its business officially and the vamsi paidipalli directorial has collected a share of Rs.46.52 crores worldwide at the end of its total run. The movie’s collections decreased drastically in its third week run.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu