»   »  కేరళలో దుమ్మురేపుతున్న రామ్ చరణ్

కేరళలో దుమ్మురేపుతున్న రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం మళయాళి వెర్షన్ త్వరలో కేరళ అంతటా భారీ ఎత్తువ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అక్కడ రైట్స్ తీసుకున్న నిర్మాత థియోటకల్ వెర్షన్ రిలీజ్ చేసారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో ఫుల్ గా హల్ చల్ చేస్తోంది. ఆ ట్రైలర్ చూసిన మళయాళిలో ఈ మాస్ మసాలా సినిమాని ఓ రేంజిలో ఎత్తుతున్నారు. రిలీజ్ కు ముందే ఇంత హంగామా ఉంటే రిలీజ్ అయితే గ్యారెంటీ హిట్టే అని అక్కడ విడుదల చేస్తున్న మంజు అంటున్నారు.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఎవడ కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. మళయాళ వెర్షన్ కు గానూ...భయ్యా అనే టైటిల్ పెట్టారు. మై బ్రదర్ అనేది ట్యాగ్లైన్. కె.మంజు అనే నిర్మాత ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. మొదట ఈ చిత్రం జనవరి 24 న విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడది జనవరి 31 కి వాయిదా వేసారు. పోస్ట్ ప్రొడక్షన్ లో డిలే వల్ల పనులు లేటు అవుతున్నాయని చెప్తున్నారు.

Yevadu Malayalam trailor goes viral

చిత్ర దర్శకులు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ 3 సంవత్సరాలపాటు నిద్రకు దూరమయ్యానని, ఇంత కష్టానికి ప్రేక్షకులు అందించిన తీయని విజయం సంతోషాన్నిస్తోందన్నారు. తెలుగు ప్రజలున్నంత కాలం తెలుగు చిత్రసీమ పదిలంగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణ మరువరానిదని కృతజ్ఞతలు తెలిపారు. కథాపరంగా రామ్‌చరణ్‌తోపాటు మరో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ కేవలం కథను నమ్మి ఈ సినిమాలో నటించటం ఎప్పటికీ మరచిపోలేనన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ సంవత్సరంన్నర పాటు శ్రమించి ఎవడు చిత్రీకరించామని 6 నెలల పాటు కొన్ని కారణాల వలన విడుదల చేయలేకపోయామన్నారు. చిత్రం విడుదల ఆలస్యం కావటంతో అనేక వదంతులు వచ్చాయని, వేటినీ తాము లెక్కచేయలేదని, కథాబలం ఉండటం వలనే ప్రేక్షకులు చిత్రానికి విజయం అందిచారన్నారు.

English summary
The Malayalam version of Ram Charan’s ‘Yevadu’ is getting ready to hit the screens soon. The film makers are planning to release the film on 31st, January and recently the film makers have released the theoretical trailer of this film which is going viral on net.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu